సాధారణంగా ఒక సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.మధ్య మధ్యలో కొన్ని కొన్ని సార్లు సినిమాలకు బ్రేకులు పడుతూ ఉంటాయి.
అటువంటి సమయంలో ఓపికగా ఉంటూ సినిమాలలోని సన్నివేశాలను ఒకటికి రెండుసార్లు షూటింగ్ జరుపుకొని టైం స్పెండ్ చేస్తూ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.అయితే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు అనుకొని సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోయినవి చాలా ఉన్నాయి.
ఇంకొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లి మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి.
అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిత్రం కూడా అలాంటిదే.
కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా 1997లో మరుదనాయగన్( Marudanayagan Movie ) అనే సినిమా ప్రారంభం అయ్యింది.కమలహాసన్ ఇరువ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఆ సినిమాను రూపొందించే ప్రయత్నం చేశారు.
కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.మళ్లీ ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత మళ్లీ సెట్స్ పైకి వెళ్ళబోతోంది.
అసలేం జరిగిందంటే.కమల్ హాసన్ 1997లో కమల్ హీరోగా నటిస్తూ తానే స్వీయ దర్శకత్వం వహించిన సినిమా మరుదనాయగన్.
1997లో ప్రారంభం అయిన ఈ చిత్రం 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

కానీ బడ్జెట్ తో పాటుగా మరికొన్ని కారణాలతో ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది.అయినప్పటికీ గతంలో చాలా సార్లు ఈ సినిమాను తప్పకుండా పూర్తి చేస్తానని, ఇది తన కలల సినిమాగా కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.అలాగే ఆ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ నిర్మాతలు సైతం పాలు పంచుకుంటున్నట్లు తెలిపారు కమల్ హాసన్.
ఈ క్రమంలోనే మళ్లీ దాదాపు 26 ఏళ్ళ తర్వాత మరుదనాయగన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

కమల్ నటించిన పాత్రలో హీరో విక్రమ్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.గతంలో కమల్ హాసన్ నటించిన సన్నివేశాలను సినిమాలో చోటు చేసుకునేలా కథను మార్చినట్లుగా తెలుస్తోంది.ఇక మరుదనాయగన్ సినిమాను 26 ఏళ్ల తర్వాత సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రధాన కారణం.
బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ లాంటి చిత్రాలు విజయాలు సాధించడమే అని తెలుస్తోంది.దాంతో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని కమల్ భావిస్తున్నారు.
