వీడు హీరో ఏంటి అనే వాళ్ళ నోరు మూయించిన ధనుష్

ఏ ఇండస్ట్రీలో నైనా చాలామంది నటులు ఉన్నారు.నటించాలి అనుకున్న వారు ఎలాగైనా, ఏదో రకంగా నటుడు అయిపోతాడు.

 Actor Dhanush Career Graph  , Dhanush , Asuran , Dhanush  Career , Karnan , Sir-TeluguStop.com

కానీ నటన మీద ఇష్టం ఉన్నోడు మాత్రమే అనేక రకాల వేరియేషన్స్ తో ఉన్న క్యారెక్టర్స్ ని తన కెరియర్లో చేయాలని అనుకుంటాడు.అలా నటనపై ఎంతో ఫ్యాషన్ ఉన్న వ్యక్తి ధనుష్.

తనలో అనువణువునా అలాంటి నటన అంటే పిచ్చి కనిపిస్తుంది.అంతే కాదు తన నటనలో చాలా మెచ్యూరిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది.

ఒక నటుడు చిరస్థాయిగా నిలబడాలంటే అతడికి కెరియర్ లో ఏదో ఒక పాత్ర ఉంటుంది.అతని కోసమే పుట్టినట్టుగా, అతడు చేసే వరకు జీవచ్ఛావంలా ఉండి అది చేసిన తర్వాతే అతడు నటుడుగా మారినట్టు జీవం పోసుకున్నట్టు శాశ్వతంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది.

Telugu Dhanush, Asuran, Dhanush Career, Karnan, Kollywood, Sekhar Kammula, Sir,

అలాంటి ఒక పాత్ర శంకరాభరణం సినిమాలో జేవి సోమయాజులు గారు చేశారు.సోమయాజులు చేయకపోయి ఉంటే అంతగా హిట్ అయ్యేది కాదు ఇక అలాంటి మరొక సినిమా ఆ నలుగురు.ఈ సినిమాలో రఘురాం పాత్ర కోసం ఎంతోమంది మహానటులను ముందుగా అనుకున్నప్పటికీ చివరికి అది రాజేంద్రప్రసాద్ గారిని వరించింది.ఈ పాత్రలు భూమ్మీద మనుషులు ఉన్నంతవరకు కూడా గుర్తుండే విధంగా ఉంటాయి.

ఇక ఇదే దోవలో హీరో ధనుష్ కి అసురన్ చిత్రం మిగిలిపోతుంది.మామూలుగానే తమిళ సినిమాలంటే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది మన వాళ్లకు.

కానీ వారు తీసే సినిమాలు ఎంతో రియలిస్టిక్ గా ఉంటాయి.తెలుగు కన్నా తమిళ సినిమాల్లో రియాలిటీ ఎక్కువగా ఉంటుంది అనే థర్డ్ ప్రాసెస్ మారేలా చేసింది అసురన్ సినిమా.

Telugu Dhanush, Asuran, Dhanush Career, Karnan, Kollywood, Sekhar Kammula, Sir,

అసురన్ సినిమా చాలామందికి ఒక డ్రగ్గు లాగా ఎక్కింది.ఆ తర్వాత కర్ణన్ సినిమా కూడా అదే రేంజ్ లో జనాలను ఇంప్రెస్ చేసింది.ఆ తర్వాత ధనుష్ పై జనాల ఒపీనియన్ మారిపోయింది.ఇప్పుడైతే అతడు ఒక తమిళంలో మాత్రమే కాదు ఇండియన్ సినిమాలోనే స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు.సర్ సినిమాతో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు అనేక భాషలను కూడా పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఇప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమ అని వేరుగా లేవు.

కేవలం భారతీయ సినిమా అనే విధంగా పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube