పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా ప్రస్తుతం చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి అందులో మొదటది యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా…( OG Movie ) ఈ సినిమా మీద ఇప్పటికే ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇక డైరెక్టర్ సుజీత్ చివరి సినిమా అయిన సాహో సరిగా ఆడకపోయినా కూడా ఈ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమా గా నిలుస్తుంది అని పవన్ అభిమానులు దిమా గా ఉన్నారు…ఇక ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది…

“ఓజి” కోసం పవన్ అసలు రెస్ట్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటూ ఆయన పార్ట్ షూట్ ని కంప్లీట్ చేసుకుంటున్నారు… అయితే ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గానే మూడో షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంది.ఇక ఇదిలా ఉండగా ఈ షెడ్యూల్ తో అయితే ఓ యంగ్ అండ్ ఫేమస్ నటుడు ఈ సినిమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఆ నటుడు ఎవరో కాదు తన బేస్ వాయిస్ తో అటు తమిళ్ తో సహా మన తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి ఫేమ్ ఉన్న నటుడు అర్జున్ దాస్…( Arjun Das ) ఈ సినిమా లో ఒక కీలక పాత్ర కోసం అర్జున్ దాస్ ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది…

మరి ఈ నటుడు ఓజి సెట్స్ లో జాయిన్ అయ్యినట్టు గా కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఇదే కనక నిజమైతే నిజంగా ఈ సినిమా తమిళ్ లో కూడా మంచి బజ్ లో ఉంటుంది…ఇక అలాగే ఇతని వాయిస్ లో పవన్ పై సరైన ఎలివేషన్ పడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని పవన్ ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు…








