టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విలన్ అజయ్(Ajay) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు.ఇటీవల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం జరిగింది.అలా విక్రమార్కుడు, ఆర్య 2, రాజన్న, దూకుడు, గబ్బర్ సింగ్, 18 పేజీస్ , విరూపాక్ష వంటి చిత్రాలతో భారీగా పాపులర్ అయిన అజయ్.మధుసూదన్ దర్శకత్వంలో వచ్చిన చక్ర వ్యూహం( Chakravyuham Movie ) అనే సినిమాలో అజయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు…
సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో అజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో విషయాలను పంచుకున్నారు.విజయ దర్శకత్వంలో శ్రీహరి హీరోగా వచ్చిన ఈ సినిమాలో నాది విలన్ పాత్ర సెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత రేప్ సీన్ షూట్ ఒకటి నాకు చెప్పారు.ఆ సీన్ షూట్ చేస్తున్న సమయంలో డోంట్ టచ్ అంటూ ఒక నటి అందరి ముందు కేకలు వేయడం నన్ను అవమానకరంగా మార్చింది.
బహుశా అది రేప్ సీన్ షూట్ అని ఆమెకు చెప్పలేదేమో.అయితే ఒక్కసారిగా ఆమె అలా అనడంతో నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.
ఆ తర్వాత ఆ షూట్ మళ్ళీ రీరైట్ చేసి షూట్ చేయడం జరిగింది.అయితే ఆమె అలా అన్నమాట ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాను.నా కెరియర్లో అదొక చేదు సంఘటన అంటూ తన జీవితంలో ఎదురైన ఇబ్బందుల గురించి వెల్లడించారు.ఇకపోతే మళ్లీ కూడా ఎప్పుడూ అలాంటి సీన్స్ లో నటించే ప్రయత్నం చేయలేదని చెప్పుకొచ్చారు.
తెరపై ఎంతో కఠినంగా కనిపించే ఆయనా నిజజీవితంలో చాలా మంచి మనస్కుడు అని చెప్పవచ్చు.ఏది ఏమైనా అజయ్ మళ్లీ వరుస సినిమాలలో బిజీ కావాలని ఆయన అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు…
.