దోస పంట సాగులో పెంకు పురుగుల నివారణకు చర్యలు..!

దోస పంట( Cucumber )కు వివిధ రకాల చీడపీడల, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.తొలి దశలో వీటిని గుర్తిస్తే నివారించి పంటను సంరక్షించుకోవచ్చు.

 Cucumber-crop-cultivation-methods , Cucumber , Cucumber Crop, Cultivation , Ne-TeluguStop.com

వాతావరణం లో ఎక్కువ మార్పు జరిగిన, పంట పొలంలో తేమ అధికంగా ఉండి నీరు నిల్వ ఉన్న సమయాలలో వివిధ రకాల తెగుళ్లు, వివిధ రకాల చీడపీడలు పంటను ఆశించే అవకాశం ఉంది.కాబట్టి దోస పంటను ఎలా సాగు చేయాలో.

దోస పంటకు తీవ్ర నష్టం కలిగించే పెంకు పురుగులను ఎలా అరికట్టాలో అనే విషయాలను తెలుసుకుందాం.

సాధారణంగా వేసవి( Summer )లో పంట పొలాన్ని లోతు దుక్కులు దున్నుకోవాలి.ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలను పంట నుండి పూర్తిగా తొలగించాలి.దోస పంటను కాస్త ఆలస్యంగా నాటుకుంటే చాలావరకు చీడపీడల బెడద తగ్గుతుంది.

కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయడం తప్పనిసరి.పంట పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

రాత్రిపూట పంటకు నీటి తడులు అందిస్తే నేలలో తేమశాతం అధికంగా ఉంటుంది.అలా కాకుండా పగటి పూట నీటి తడులు అందించాలి.

దోస పంటకు పెంకు పురుగుల బెడద చాలా ఎక్కువ.ఈ పురుగులు మొక్క ఆకులను ఆశించడం వల్ల వేర్లు, కాండం బలహీనపడి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.ఈ పురుగులు పూత, పిందె దశలో ఉన్నప్పుడు పంటను ఆశిస్తే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.కాబట్టి ఈ పురుగుల ఉనికిని గుర్తించి సేంద్రీయ పద్ధతిలో ఐదు మిల్లీలీటర్ల వేప నూనె( Neem oil )ను ఒక లీటరు నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.

అయినా కూడా ఈ పురుగుల బెడద తగ్గకుంటే అప్పుడు రసాయన పద్ధతిలో పిచికారి మందులను ఉపయోగించి నివారించుకోవాలి.రసాయన పిచికారి మందులైన ఎసిటప్రిమిడ్, కర్బారీల్ లలో ఏదో ఒకదానితో పిచికారి చేసి అరికడితే అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube