ప్రతీ చర్యకి ప్రతి చర్య ఉంటుంది.తమ టైం నడుస్తుంది అంటూ ఏది పడితే అది చేస్తే ఒకసారి టైం తిరగబడితే దానికి పది రెట్లు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
ఇది రాజకీయ నాయకులు అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య సూత్రం.భాజపా ప్రభుత్వం( BJP ) ఈ మధ్య తీసుకుంటున్న కొన్ని చర్యలు ఇప్పుడు ప్రతిపక్షాలన్నిటిని ఏకం చేస్తున్నాయి .ఇప్పుడు కేంద్రంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రధానమంత్రి మోడీ సర్కార్( Modi government ) పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి .ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి వారిని రాజకీయంగా నాశనం చేయడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారని, స్వతంత్రంగా ఉండాల్సిన వాటి పని విధానాన్ని వీరి పబ్బం గడుపుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని, ఈ సంస్థలు ఎలాంటి విధి విధానాలు పాటించకుండా అరెస్టులు చేస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి .ప్రతిపక్ష కూటమి తరపున తరుపున కాంగ్రెస్ నేత, లాయర్ అభిషేక్ మను సింఘ్వీ( Abhishek Manu Singhvi ) పిటిషన్ దాఖలు చేశారు .

బిజెపి వ్యతిరేక నాయకులే లక్ష్యంగా ఈ సంస్థల పనితీరు ఉంటుందని ఇప్పటివరకు ఈడి కేసులు పెట్టిన 95 శాతం మంది బిజెపి యేతర నాయకులేనని ,ఒకసారి బిజెపిలో చేరిన తర్వాత వారిపై కేసులన్నీ మరుగున పడిపోతున్నాయని ఇవి కేవలం రాజకీయంగా తమ బలం పెంచుకోవడం కోసం లేదా తమ వ్యతిరేకు బలం తగ్గించడం కోసం మాత్రమే కేసులు పెడుతున్నారని స్వతంత్ర సంస్థల మనుగడను దెబ్బతీస్తే ఇలాంటి చర్యలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.ఈ కేసులో కాంగ్రెస్ తో పాటు బారాస శివసేన ,తృణముల్ కాంగ్రెస్, ఆప్, సహా దాదాపు 14 ప్రతిపక్ష పార్టీలు కలసి ఈ పిటిషన్ వేసాయి.సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడ్( DY Chandra Choudh ) నేతృత్వం లో ని బెంచ్ ఈ పిటిషన్ ను లిస్టింగ్ చేసింది.
ఈ పిటిషన్ పై విచారణ వచ్చే నెల 5వ తారీఖున రానుంది.

అయితే ప్రతిపక్షాల ఐక్యత వెనుక ఆప్ నేత కేజ్రీవాల్ ( Kejriwal )పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఆయన బలమైన ప్రయత్నంతోనే ప్రతిపక్షాల ఐక్యత కుదిరిందని తమ రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేత మీ రాష్ట్రాల్లో కూడా మొదలవచ్చంటూ ఆయన ప్రతిపక్ష నాయకులకు హితబోధ చేసి వారందరిని ఏకతాటి పైకి తీసుకొచ్చారని వార్తలు వస్తున్నాయి.మరి తమకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవడం గమనిస్తున్న భాజపా పార్టీ నేతలు ఏ రకమైన కార్యాచరణను ఎన్నుకుంటారు చూడాలి
.







