తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు( Kinjarapu Atchannaidu ) వ్యాఖ్యలు జనసైనికులకు ఇప్పుడు కొత్త సమస్యలు తీసుకు వస్తున్నాయట .తాను వెళ్లిన ప్రతి సభలోను తెలుగు తమ్ముళ్లను ఉత్సాహపరచడానికి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తెలుగుదేశం జనసేన పొత్తుపై ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషణలు వస్తున్నాయి.
వైసీపీ పార్టీ( YCP ) పని అయిపోయిందని వచ్చేది తమ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి అచ్చం నాయుడు ఆసక్తి చూపిస్తున్నారు.అంతే కాకుండా వచ్చే ఎన్నికలలో 160 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని ఆయన చెప్పడం ఆ పార్టీ వరకు బాగానే ఉన్నప్పటికీ మరి మా సంగతి ఏమిటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు .
తెలుగుదేశం జనసేన( Jana sena ) పొత్తు దాదాపు కన్ఫామ్ అయిపోయిందని మీడియాతో పాటు సాధారణ జనం కూడా భావిస్తున్న ఇలాంటి తరుణంలో తమను కనీసం పట్టించుకోకుండా , తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా ఆ పార్టీకి 160 సీట్లు వస్తాయని ఆయన ప్రకటించడం వెనక ఉద్దేశాలు ఏమిటా అని జనసైనికులు మండిపడుతున్నారు.160 సీట్లు మీరే గెలుచుకోవాలి అంటే 175 స్థానాలలో మీరే పోటీ చేయాలి కదా మరి మా సంగతి ఏమిటి అని కొందరు జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తున్నారు.ఇది కేవలం తమ్ముళ్ళను ఉత్సాహపరిచే ప్రక్రియా ? లేకపోతే జనసేనకు ఎక్కువ సీట్లు వచ్చే ఉద్దేశం లేదని అన్యాపదేశంగా చెబుతున్నారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయట .
భవిష్యత్తులో పొత్తు చర్చలలో జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వకూడదు అంటే మానసికంగా ఆ పార్టీని ప్రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడే ఇలా పార్టీ అధ్యక్షుడు ద్వారా మాట్లాడిస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నవారు లేకపోలేదు.ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం ఉండి లో జరిగిన పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేసిన అచ్చెన్న భవిష్యత్తులో ఇదేరకంగా కొనసాగితే మాత్రం జనసేన-తెలుగు దేశం పొత్తు చిక్కుల్లో పడుతుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మరి పార్టీ అధిష్టానం ఇప్పటికైనా కలుగ చేసుకొని ఈ దిశగా అచ్చన్న వ్యాఖ్యలను సవరించకపోతే రాజకీయంగా తెలుగుదేశం నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.
ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తు అవసరం జనసేన కంటే తెలుగుదేశానికి ఎక్కువ ఉంది కాబట్టి
.