ఆచార్య సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను ఏకంగా 42 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.దిల్ రాజు నుంచి పోటీ ఎదురైనా వరంగల్ శ్రీను మాత్రం ఎక్కువ మొత్తం ఆఫర్ ఇచ్చి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు.
అయితే ఆచార్య మూడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 45 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.ఈ కలెక్షన్లలో నైజాం కలెక్షన్లు నాలుగో వంతు మాత్రమే కావడం గమనార్హం.
ఈరోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి.ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లకు పరిమితమయ్యే ఛాన్స్ ఉంది.
వరంగల్ శ్రీనుకు ఈ సినిమాతో భారీగా నష్టాలైతే తప్పవని తెలుస్తోంది.నిబంధనల ప్రకారం నష్టం ఎంతొచ్చినా వరంగల్ శ్రీనుకు మెజారిటీ వాటా ఉంటుందని బోగట్టా.అయితే ఆచార్య నైజాం నష్టాలు విజయ్ దేవరకొండ భర్తీ చేస్తారని తెలుస్తోంది.
లైగర్ సినిమా నైజాం హక్కులను కూడా వరంగల్ శ్రీను కొనుగోలు చేశారని బోగట్టా.

పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని విజయ్ దేవరకొండ అభిమానులు సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.2022 సంవత్సరం ఆగష్టు 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

విజయ్ కు జోడీగా ఈ సినిమాలో అనన్య పాండే నటిస్తున్నారు.ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.లైగర్ సినిమాతో వరంగల్ శ్రీను కష్టాలు తీరతాయో లేదో చూడాల్సి ఉంది.
లైగర్ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించాలని విజయ్ దేవరకొండ అభిమానులు సైతం మనస్పూర్తిగా కోరుకుంటున్నారని తెలుస్తోంది.







