రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసు నిందతుడికి పోలీస్ కస్టడీ విధించింది న్యాయస్థానం.ఈ మేరకు నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
ఇవాళ్టి నుంచి ఈనెల 10 వరకు హరిహరకృష్ణను అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు విచారించనున్నారు.హరిహరకృష్ణకు ఇంకా ఎవరైన సహకరించారా అనే దానిపై దర్యాప్తు చేయనున్నారు.
సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు.అదేవిధంగా హరిహరకృష్ణ స్నేహితులు, కుటుంబ సభ్యులనూ పోలీసులు ప్రశ్నించనున్నారు.







