టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ స్కాంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిందితులను ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు.
అదేవిధంగా టీఎస్పీఎస్సీ ప్రవీణ్ ఎన్ని పేపర్లు ఇలా లీక్ చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు.
షేరింగ్ అండ్ సెల్లింగ్ స్కాంగా పోలీసులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే పలు ఉద్యోగాలకు సంబంధించిన పేపర్లు లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రవీణ్, రేణుక కాంటాక్ట్స్ లో పలువురు అభ్యర్థుల నెంబర్లను గుర్తించారని తెలుస్తోంది.
ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది.అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మీ ఫోల్డర్ లో ఉన్న పేపర్లపై విచారణ జరుగుతోంది.
ఈ వ్యవహారంలో మొత్తం తొమ్మిది మందిని పోలీసులు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.







