ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ వుతున్నాయి.సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా అంటూ క్యాప్షన్ లో కూడా జోడిస్తూ ఉంటారు.
ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు(Childhood pic) సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.తాజాగా మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా నిలుస్తోంది.మరి ముఖ్యంగా ఎక్కువగా కాంట్రవర్సీ విషయంలో ఆమె బాగా పాపులర్ అయింది అని చెప్పవచ్చు.
అయితే మొన్నటి వరకు కేవలం సినిమాల విషయంలో మాత్రమే వినిపించిన పేరు ఆ తర్వాత ఒక ప్రేమ పెళ్లి వ్యవహారం విషయంలో హాట్ టాపిక్ గా మారిపోయింది.ఈపాటికి ఇప్పటికే ఆ ఫోటోలో ఉన్న ఆమె ఎవరో అర్థం అయిపోయుంటుంది.
ఇంకా అర్థం కాలేదా ఆమె మరెవరో కాదు పవిత్ర లోకేష్(Pavitra lokesh). తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది పవిత్ర లోకేష్.
సినిమాలలో అమ్మ, వదిన, అక్క, భార్య పాత్రలో ఎక్కువగా నటించి మెప్పించింది.

ఇకపోతే ఈమె టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ తో(Naresh) రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.ఇదే విషయం గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు సహజీవనం చేస్తున్నారు త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు అంటూ వార్తలు వినిపించగా మొదట్లో ఆ వార్తలను కొట్టి పారేసిన ఆ జంట ఆ తర్వాత ఈ ఏడాది మొదట్లో ఒక ఫోటోను షేర్ చేసి త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నాము అంటూ తెలిపిన విషయం తెలిసిందే.

ఇటీవల నరేష్ పెళ్లి చేసుకున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరోసారి వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిపోయాయి.వీడియో పై నరేష్ స్పందిస్తూ అటువంటిది ఏమీ లేదని ఒకవేళ అలాంటిదే ఉంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ప్రకటిస్తాను అని చెప్పడంతో అవన్నీ అని తేలిపోయాయి.కానీ ఆ వీడియోని నరేష్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.ఆ పెళ్లి వీడియోని తానే షేర్ చేసిన నరేష్ పెళ్లి కాదు అని చెప్పడంతో చాలామంది అయోమయపడుతున్నారు.
ఈ జంట ప్రస్తుతం దుబాయ్ లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.







