బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.జాతీయ నాయకత్వాలకు వెళ్తున్న కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.అక్రమ కేసులు, అణచివేతలతో కేసీఆర్ ను ఏమీ చేయలేరని తెలిపారు.
నియంతల రాజ్యాలు ఎక్కువ కాలం సాగినట్లు చరిత్రలో లేదని చెప్పారు.రాబోయే రోజుల్లో బీజేపీ అసలు రూపాన్ని బట్ట బయలు చేస్తామని వెల్లడించారు.







