Vastu Shastra : వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లోనీ ఏ వస్తువులు ఎక్కడ ఉంటే మంచిదో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఇల్లు నిర్మించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంట్లో అలంకరించే వస్తువుల వరకు ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారం( Vastu Shastra ) ఉండాలని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు.

ఇలా ఉంటేనే ఇంట్లో సంతోషం వస్తుందని పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు.

ఇలా ఉండడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని కూడా చెబుతారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఏ దిశలో ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఉత్తర దిక్కున కుబేరున్ని ఎక్కువగా భావిస్తారు.ఈ దిశలో ఖజానా ఉంచడం సరైనది కాదు.

కానీ మీరు మీ దుకాణంలో లేదా ఏదైనా వ్యాపార స్థలంలో ఈ దిశలో డబ్బులను పెట్టవచ్చు.

According To Vastu Shastra Do You Know Which Things Are Better In The House
Advertisement
According To Vastu Shastra Do You Know Which Things Are Better In The House-Vas

ఉత్తర దిశను ( North direction )ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు.కాబట్టి మీరు ఈ దిశలో చిన్న షవర్ ఏర్పాటు చేసుకోవాలి.ఇక తూర్పు దిశ విషయంలో పలు వాస్తు నియమాలను పాటించాలి.

ముఖ్యంగా చెప్పాలంటే తూర్పు దిశలో వస్తువులు లేకుండా చూసుకోవాలి.ఈ దిశకు అధిపతులు సూర్యదేవుడు, ఇంద్రదేవుడు ( Suryadev , Indradev ) రోజుకి ఒకసారి ఈ దిశలో దీపం వెలిగించాలి.

ఈ స్థలాన్ని శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.అలాగే గణేశుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని( Goddess Lakshmi idol ) ఈ దిశలో ఉంచితే మంచిది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో బరువైన వస్తువులు ఉండేలా చూసుకోవాలి.అలాగే ఈ దిశలో డబ్బులు నిల్వ చేయాలి.

According To Vastu Shastra Do You Know Which Things Are Better In The House
తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!

ఎందుకంటే ఇది డబ్బును డిపాజిట్ చేయడానికి ఉత్తమమైన ప్రదేశం.ఈ దిశలో మరుగుదొడ్లు అస్సలు నిర్మించకూడదు.ఇది యమాధిపతి దిశ.అలాగే పశ్చిమ దిశకు ఆది దేవత వరుణుడు.దీని పాలక గ్రహం శని.ఈ దిశలో ఇంటి వంటగదిని ( kitchen )నిర్మించుకుంటే మేలు జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.అలాగే ఈశాన్య దిశ శివుని స్థానంగా చెబుతూ ఉంటారు.

Advertisement

ఈ దిశకు గృహస్పతి అధిపతి.పూజ గృహం, బోరింగ్, వాటర్ ట్యాంక్ కూడా ఈ దిశలో నిర్మించుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే నైరుతి దిశలో కూడా సామాగ్రి వంటి వస్తువులను పెట్టాలి.అలాగే వాయువ్యం దిశలో విసిటింగ్ హాల్ వంటి నిర్మాణాలను చేపట్టవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు