యాదాద్రి భువనగిరి జిల్లా:ఆర్ అండ్ బీ జీవో నిబంధనల మేరకు గతంలో కొలిచిన ప్రకారం చిన్నకొండూర్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని పాత ఊరు భూ నిర్వసితులు డిమాండ్ చేశారు.చౌటుప్పల్( Choutuppal ) పట్టణ కేంద్రంలో శనివారం పాత ఊరు భూ నిర్వసితుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ చౌటుప్పల్ హైస్కూల్ నుంచి చిన్న కొండూరు( Chinnakondur ) గ్రామం వరకు 21 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని,కానీ,చౌటుప్పల్ టౌన్ కి వచ్చేసరికి రామాలయం నుంచి హైస్కూల్ వరకు 33 ఫీట్ రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పడం సరికాదన్నారు.
టౌన్ లో 33 ఫీట్ వెడల్పు రోడ్డు పనులు చేపడితే అనేక మంది తమ ఇల్లు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని చౌటుప్పల్ టౌన్ లో కూడ ఆర్ అండ్ బీ జీవో( R&B G O ) ప్రకారం 21 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరారు.వరగంటి రాజేందర్ అధ్యకతన జరిగిన ఈ సమావేశంలో సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్,స్థానిక కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు, కౌన్సిలర్లు దండ హిమ బిందు భర్త అరుణ్ కుమార్,బొడిగే అరుణ భర్త బాలకృష్ణ గౌడ్, భూ నిర్వాసితులు బొబ్బిళ్ళ శ్రీరాములు,ఎండీ కయ్యుమ్, వరగంటి మహేందర్ గౌడ్,గడ్డం రఘుపతి,రాజపేట అశోక్ గౌడ్,చింతల తిరుమల్ రెడ్డి, రాజపేట రాజు గౌడ్,మామిడి శివకుమార్,ఎరుకల నరేష్ గౌడ్,వరగంటి గణేష్ గౌడ్, డా.కోజి గోపి తదితరులు పాల్గొన్నారు.







