యూఎస్‌లో యాక్సిడెంట్.. రోడ్డు అంతటా పడిపోయిన చాక్లెట్, కారామెల్..

మామూలుగా ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేస్తున్న వాహనాలు ప్రమాదానికి గురైతే అవన్నీ రోడ్డుపై చల్లా చదివిగా పడిపోతుంటాయి ఇప్పటికే మన దేశంలో ఆయిల్ తీసుకెళ్తున్నావా నాలుగు పడిపోయి రోడ్డు అంతటా ఆయిల్ పోవడం మనం చూసాం.ఇంకా పండ్ల వాహనాలు కూడా ప్రమాదాల కారణంగా పడిపోతుంటాయి.

 Accident In Us Chocolate, Caramel Fell All Over The Road , Accident In Us Choco-TeluguStop.com

అలాంటప్పుడు స్థానికులు ఆ పండ్లు ఇంటికి తీసుకెళ్లేందుకు పోటెత్తితుంటారు.అయితే తాజాగా అమెరికా( America )లో చాక్లెట్, కారామెల్( Chocolate, Caramel ) తీసుకెళ్తున్న ఒకటి ట్రక్కు వేరే ట్రక్కును ఢీ కొట్టింది.

దీనివల్ల ఐటమ్స్ రోడ్డు మీద చల్లా చెదురుగా పడిపోయి కనిపించాయి.వివరాల్లోకెళితే ఇటీవల, ఒక ప్రధాన యూఎస్ హైవేపై రెండు సెమీ ట్రక్కులు ఢీకొన్నాయి, ఈ ఘటన తర్వాత చాక్లెట్, కారామెల్ క్యాండీలు రోడ్డు మీద పడిపోయాయి.

ఈ ప్రమాదం గురువారం ఉదయం ఒహియోలోని లేక్ కౌంటీలో 13 రాష్ట్రాల గుండా వెళ్లే కోస్టల్-టు-కోస్ట్ హైవే అయిన ఇంటర్‌స్టేట్ 90 (I-90)లో జరిగింది.

Telugu America, Candy Spill, Heavy Rescue, Interstate, Lake County, Ohio, Ohiohi

ఒహియో స్టేట్ హైవే పెట్రోల్( Ohio State Highway Patrol ) ప్రకారం, ట్రక్కులలో ఒకటి చాక్లెట్, కారామెల్‌తో సహా మరిన్ని స్వీట్స్ తీసుకువెళుతోంది, అది మరొక ట్రక్కుకు డ్యాష్ ఇచ్చింది.దీని ప్రభావం వల్ల స్వీట్స్ హైవేపైకి వచ్చాయి , రహదారికి ఇరువైపులా పడిపోయాయి.కాంకర్డ్ టౌన్‌షిప్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఉదయం 6:06 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఘటనా స్థలానికి చేరుకుంది.స్వీట్ ట్రక్‌కు భారీ నష్టం వాటిల్లింది.క్యాబ్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను విడిపించడానికి అగ్నిమాపక శాఖ హెవీ రెస్క్యూ చేయాల్సి వచ్చింది.అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.ఇద్దరు డ్రైవర్లు సంఘటనా స్థలం నుంచి బయటికి వెళ్ళగలిగారు.

Telugu America, Candy Spill, Heavy Rescue, Interstate, Lake County, Ohio, Ohiohi

స్వీట్ల చెత్తను తొలగించేందుకు అధికారులు కృషి చేయడంతో హైవేను తాత్కాలికంగా మూసివేశారు.శుభ్రపరచడానికి రెండు గంటల కంటే తక్కువ సమయం పట్టింది.ఉదయం 8 గంటలకు హైవే తిరిగి తెరవబడింది.ఓహియో స్టేట్ హైవే పెట్రోలింగ్ ఇప్పటికీ క్రాష్‌కి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube