నోటుకు ఓటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ ఇంటరాగేషన్‌లో ఏం చెబుతున్నాడో….? నాలుగు రోజుల ఇంటరాగేషన్లో మొదటి రోజైన శనివారం విచారణ కొనసాగుతోంది.సాయంత్రం వరకు ఇది కొనసాగుతుంది.ఇంటరాగేషన్ ఎన్ని గంటలు సాగుతుందనేదానిపై మీడియాలో భిన్నమైన వార్తలు వచ్చాయి.ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుందని రేవంత్ తరపు న్యాయవాదుల్లో ఒకరు చెప్పాగా, టివి ఛానెళ్లలో, పత్రికల్లో వార్తలు తేడాగా ఉన్నాయి.సాయంత్రం ఐదు గంటల వరకని ఒక ఛానెల్లో చెప్పగా, ఐదున్నర వరకని మరో ఛానెల్లో చెప్పారు.
ఎవరెలా చెప్పినా సాయంత్రం వరకనేది అర్ధమవుతోంది.రెండు తెలుగు ప్రజలకు, అన్ని పార్టీల నాయకులకు ఒకటే ఉత్కంఠగా ఉంది.
రేవంత్ రెడ్డి ఇంటరాగేషన్లో ఏం చెబుతున్నాడు? అని వారికి వారే ప్రశ్నించుకుంటున్నారు.ఒకవేళ రేవంత్ మౌనంగా ఉన్నా మూడో డిగ్రీ (కొట్టడం) ఉపయోగించకూడదని న్యాయస్థానం గట్టిగా ఆదేశించింది కాబట్టి ఏసీబీ అధికారులు ఆ పని చేయరు.
రేవంత్ అప్రూవర్‌గా మారతాడేమోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అదే జరిగితే చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఏసీబీ అధికారులు ఉదయమే చర్లపల్లి జైలకు వెళ్లి రేవంత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.ఈ సమయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.అయితే ముందుగా తమకు సమాచారం అందించలేదని రేవంత్ తరపు న్యాయవాదులు జూబ్లీ హిల్‌్సలోని ఏసీబీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
లాయర్ల సమక్షంలో విచారించాలని చెప్పినా అధికారులు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.సాయంత్రం కల్లా ఏమైనా విషయాలు లీకవుతాయా? చూడాలి.