అవినీతి నిరోధానికి ఏసీబీ మొబైల్‌ యాప్‌

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌అవినీతి నిరోధానికి ఏసీబీ మొబైల్‌ యాప్‌గతంలో సీఎం ఆదేశాలమేరకు యాప్‌ తయారు చేసిన ఏసీబీ‘ఏసీబీ 14400’ పేరుతో యాప్‌ క్యాంపు కార్యాలయంలో యాప్‌ను ప్రారంభించిన సీఎం స్పందన పై సమీక్షలో యాప్‌ను ప్రారంభించిన సీఎం.

 Acb Mobile App To Prevent Corruption , Acb Mobile App , Prevent Corruption , C-TeluguStop.com

సీఎం జగన్ కామెంట్స్

ఈ ప్రభుత్వం వచ్చిన నాటినుంచి ఒకటే మాట చెప్తున్నాం ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట చాలా స్పష్టంగా చెప్పాం ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టాం చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపాం ఎక్కడైనా, ఎవరైనా కూడా. కలెక్టరేట్‌ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే.

ఎవరైనా చేయాల్సింది ఒక్కటే.

తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి… బటన్‌ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయండి.ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వస్తున్నాం ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుంది ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉంది అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది మన స్థాయిలో అనుకుంటే.50శాతం అవినీతి అంతం అవుతుంది మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యం ఎవరైనా పట్టుబడితే.కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి

యాప్‌ ఎలా పనిచేస్తుందంటే…

పౌరులు నేరుగా యాప్‌ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్‌ డౌన్లోడ్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ రిజిస్టర్‌ చేయగానే వినియోగానికి యాప్‌ సిద్ధం యాప్‌లో 2 కీలక ఫీచర్లు యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్‌రిపోర్ట్‌ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం లాడ్జ్‌ కంప్లైంట్‌ ఫీచర్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.ఫిర్యాదుకు తనదగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌కు రిఫరెన్స్‌ నంబరు త్వరలో ఐఓఎస్‌ వెర్షన్‌లోనూ యాప్‌ను సిద్ధంచేస్తున్న ఏసీబీ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube