హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు( HMDA Former Director Shiva Balakrishna )లో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా శివబాలకృష్ణ మేనల్లుడు, డ్రైవర్ తో పాటు అటెండర్ ను అధికారులు విచారించారు.
ఈ క్రమంలోనే మేనల్లుడు భరత్( Bharat ) పేరుపై వంగూరులో సుమారు 13 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.అలాగే శివబాలకృష్ణ మరో బినామీ సత్యనారాయణపై కూడా భారీగా ఆస్తులున్నాయని తెలుస్తోంది.
బినామీల విచారణలో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.అయితే ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు( ACB Officials ) అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.