స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెండు వారాల క్రితం చంద్రబాబుని( Chandrababu Naidu ) సీఐడీ అరెస్టు చేయడం తెలిసిందే.ఆ సమయంలో ఏసీబీ న్యాయస్థానం( ACB Court ) 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది.
అయితే నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా ఏసీబీ న్యాయస్థానం ముందు చంద్రబాబుని హాజరు పరిచారు.ఈ సందర్భంగా ఏసీబీ న్యాయమూర్తి విచారణ సమయంలో అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా.? వైద్య పరీక్షలు నిర్వహించారా.? అని చంద్రబాబును న్యాయమూర్తి ఆరా తీశారు.
దీనికి ఆయన ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు సమాధానం ఇచ్చినట్లు సమాచారం.ఇదే సమయంలో చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ ఐదవ తేదీ వరకు అంటే మరో పదకొండు రోజులు పొడిగించారు.
చంద్రబాబుకి విధించిన రెండు రోజుల కస్టడీ కూడా నేటితో ముగియడంతో ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ( CID ) కోరింది.కాగా రెండు రోజుల కస్టడీలో 12 గంటలకు పైగా విచారించిన సీఐడీ 120 ప్రశ్నలు సంధించింది.
ఇదిలా ఉంటే చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది.