ఏలూరు జిల్లాలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది.డీటీసీ మృత్యుంజయ రాజు నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు.
ఈ క్రమంలో ఏలూరులోని ఇంటితో పాటు విజయవాడలోని నాలుగు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మృత్యుంజయరాజుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదు వచ్చింది.దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.