చంద్రబాబుకు యాత్రలు కలసి రావడం లేదా..?

తెలుగు రాజకీయాల్లో..

 Bad Incidents In Chandrababu Naidu Public Meetings Kandukuru Details, Chandrabab-TeluguStop.com

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది ఒక ప్రత్యేక స్థానం.ఆయన రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన దగ్గరి నుంచి ఏన్నో ఆటో పోట్లు ఎదుర్కుంటూ వచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది.అదే అనుభవంతో అన్నగారి పార్టీని ఇంతకాలం లాక్కొచ్చారు.

ఇక వయసు మీద పడుతున్న కొద్దీ పార్టీ భారాన్ని తనయుడిపై వేయాలని చూస్తున్నారు.అయితే అటు లోకేష్ శైలి అంతగా కలసి రాకపోవడంతో.

ఆరవై ఏళ్లు దాటినా ఇంకా ఒంటరి పోరాటం చేస్తున్నారు.అయితే ఆయనకు ఈ మధ్యన యాత్రలు అస్సలు కలసి రావడం లేదు.

ఎన్నికల ముందు ఆయన చేసిన యాత్రల్లో ఏదో ఒక అపశ్రుతి జరుగుతూనే ఉంది.పుష్కరాల టైం లో చంద్రబాబు పర్యటన వల్ల సుమారు 30 మంది దాకా చనిపోయారు.

అప్పట్లో అధికారంలో ఉన్నా.అది చాలా మైనస్ గా మారింది.

నిజానికి ఆయనకు వీఐపీ గేట్ ఎంట్రీ ఉన్నా.సామాన్యులు వచ్చే స్నానాల ఘాట్ కు వచ్చారు.

దాంతో భారీ తొక్కిసలాట జరిగి అంత మంది చనిపోయారు.అప్పటి నుంచి చంద్రబాబు ప్రతీ యాత్రలో చాలా జాగ్రత్తలు తీసుకుంటు వస్తున్నారు.

యాత్రలు కూడా వద్దని అప్పట్లో అనుకున్నారు.

Telugu Chandrababu, Kandukuru Yatra, Lokesh, Tdpkandukuru, Tdp, Tdp Yatra-Politi

ఇక లోకేష్ పాదయాత్ర కు ముందస్తు ప్రిపరేషన్ గా బాబు యాత్ర చేయాల్సి వచ్చింది.అయితే అది కూడా ఆయనకు కలసిరాలేదు.ఈ సారి కూడా అదే అపశృతి జరిగింది.

ఈ విషయంలో అటు తెలుగు తమ్ముళ్ల తో పాటు అధినేత కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు.అంతే కాకుండా ఏకంగా మృతి చెందిన ఒక్కొక్కరికి 15 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

అయితే ఇప్పుడు చంద్రబాబుకు యాత్రలు కలిసి రావడం లేదనే వార్త తెగ వైరల్ అవుతోంది.మరి ఇప్పటి నుంచి యాత్రలు బాబు కొనసాగిస్తారా.? లేక చిన్నా చితకా యాత్రలతో సర్దుకుంటారా అనేది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube