కల్పికతో ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చిన అభినవ్ గోమఠం... రచ్చకు కారణం ఇదేనంటూ?

సినిమా సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్త ప్రచారంలోకి వచ్చినా ఆ వార్త క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ మధ్య కాలంలో కమెడియన్ గా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన అభినవ్ గోమఠం కల్పిక చేసిన ఆరోపణల వల్ల వార్తల్లో నిలిచారు.

 Abhinav Gomatham Clarity About Issue With Kalpika Ganesh Details Here Goes Vira-TeluguStop.com

అభినవ్ గోమఠం తనను వేధించాడని నా గురించి అసభ్యంగా మాట్లాడారని కల్పిక గణేష్( Kalpika Ganesh ) చేసిన ఆరోపణలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయనే సంగతి తెలిసిందే.ఈ గొడవలో చివరకు పోలీసులు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

తాజాగా ఈ గొడవ గురించి అభినవ్ గోమఠం స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కల్పిక తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని ఆయన అన్నారు.కల్పికతో నాలు ఎలాంటి ఎఫైర్ లేదని అభినవ్ గోమఠం చెప్పుకొచ్చారు.కల్పికతో నాకు పెద్దగా పరిచయం కూడా లేదని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

కల్పికతో నేను చాట్ చేసేవాడినని అది కూడా కేవలం ఆరు నెలలకు ఒకసారి మాత్రమేనని ఆయన అన్నారు.అయితే గతేడాది ఒక సంఘటన జరిగిందని కల్పికకు నారీ శక్తి అవార్డ్( Nari Shakti Award ) వచ్చిందని నాకు మెసేజ్ చేసిందని ఆ అవార్డ్ గురించి నేను ఎప్పుడూ వినలేదని అభినవ్ గోమఠం అన్నారు.

అయినప్పటికీ నీకు అవార్డ్ రావడం గొప్ప విషయం అని అభినవ్ గోమఠం( Abhinav Gomatam ) కామెంట్లు చేశారు.

అప్పటినుంచి కల్పిక గొడవ మొదలుపెట్టిందని అవార్డ్ గురించి వినలేదు అంటావా? నీకు అంత చులకనా? అంటూ కామెంట్లు చేసిందని అభినవ్ గోమఠం అభిప్రాయం వ్యక్తం చేశారు.అప్పటినుంచి నన్ను పురుషాహంకారి అంటూ ఆమె కామెంట్లు చేస్తోందని ఆయన అన్నారు.అభినవ్ గోమఠం చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అభినవ్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube