పెనుమర్తి దర్శకత్వం లో డాక్టర్ ఆర్ కె నీతి పూడి నిర్మిస్తున్న చిత్రం అభిమన్యు చిత్రం ప్రారంభం

సువర్ణ కృష్ణ ఫిలిమ్స్ పతాకంపై జిసాన్, అయుక్త హీరో హీరోయిన్ గా సీనియర్ నటులు బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, భాను చందర్, దేవకి, వసంత మరియు అన్నపూర్ణ ముఖ్య తారాగణం తో విజయ్ శేఖర్ పెనుమర్తి దర్శకత్వం లో డాక్టర్ ఆర్ కె నీతి పూడి నిర్మిస్తున్న చిత్రం “అభిమన్యు”.ఈ చిత్రం ఈరోజు రామానాయుడు స్టూడియోస్ లో 7 గంటల 30 నిమిషాలకు లాంఛనంగా ప్రారంభం అయింది.

 Abhimanyu Film Start Produced By Dr. Rk Nithi Pudi Under The Direction Of Penu-TeluguStop.com

ఈ సందర్భంగా గా దర్శకుడు విజయ్ శేఖర్ పెనుమర్తి మాట్లాడుతూ “నేటి సమాజంలో జరుగుతున్న ఒక సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని చేస్తున్న చిత్రం ఇది.కథ చాలా బాగా వచ్చింది.తెలంగాణ దేవుడు చిత్రం లో యువ కె సి ఆర్ గా నటించిన జిసాన్ మా చిత్రంలో హీరో గా నటిస్తున్నాడు.ముంబయి నటి అయుక్త ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం.

బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, భాను చందర్, దేవకి, వసంత మరియు అన్నపూర్ణ వంటి సీనియర్ నటులు మా చిత్రం లో పని చేయడం చాలా ఆనందంగా ఉంది.మా నిర్మాత డాక్టర్ ఆర్ కె నీతి పూడి రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతానికి కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ కలిసి ముంబయి లో పడిన పాటను రామానాయుడు స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు” అని తెలిపారు.

నిర్మాత డాక్టర్ ఆర్ కె నీతి పూడి “మా దర్శకుడు విజయ్ శేఖర్ పెనుమర్తి చెప్పిన కథ చాలా బాగా నచ్చింది.

మంచి కథ, కథనం తో కమర్షియల్ హంగులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నాం.నేటి యువత ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం “అభిమన్యు“.

దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు.కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ గారు పాడిన పాటకు నేను సాహిత్యం అందించాను” అని తెలిపారు.

బ్యానర్ : సువర్ణ కృష్ణ ఫిలిమ్స్

టైటిల్ : అభిమన్యు

హీరో : జిసాన్

హీరోయిన్ : అయుక్త

నటి నటులు :

బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, భాను చందర్, దేవకి, వసంత, అన్నపూర్ణ మరియు తదితరులు

కెమెరా : ప్రసాద్

మ్యూజిక్ : రవి కుమార్, డాన్స్ మాస్టర్ : బ్రదర్ ఆనంద్, సింగర్ : కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ , లిరిక్స్ : గురు చరణ్, డాక్టర్ ఆర్ కె నీతి పూడి పి ఆర్ ఓ : పాల్ పవన్, దర్శకుడు : విజయ్ శేఖర్ పెనుమర్తి, నిర్మాత : డాక్టర్ ఆర్ కె నీతి పూ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube