ముంబై లో 'ఆర్ఆర్ఆర్' గ్రాండ్ పార్టీ.. గెస్ట్ గా స్టార్ హీరో.. పార్టీ అందుకేనా?

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

 Aamir Khan To Party With Team Rrr, Ram Charan, Rrr, Ss Rajamouli , Ntr, Mumbai,-TeluguStop.com

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.

ప్రెసెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ మ్యానియా కనిపిస్తుంది.బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ ఇంకా దూసుకు పోతుంది.

మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టి ఆర్ ఆర్ ఆర్ పవర్ చూపించింది.ఇంత అద్భుతమైన హిట్ అందుకున్న నేపథ్యంలో టీమ్ అంతా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు.

Telugu Aamir Khan, Aamir Khan Rrr, Mumbai, Ram Charan, Ss Rajamouli-Movie

రిలీజ్ అయినా అన్ని ఏరియాల్లో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది.పది రోజుల్లోనే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాబట్టింది.అటు నార్త్ లో కూడా దాదాపు 200 కోట్ల రూపాయలను వసూలు చేయడంతో పెన్ స్టూడియోస్ జయంతిలాల్ గడ బుధవారం ముంబై లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గెస్ట్ గా హాజరవుతారని టాక్ వినిపిస్తుంది.

అలాగే పెన్ స్టూడియోస్ ఈ ఈవెంట్ లో రాజమౌళి తో పాటుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లను కూడా సత్కరిస్తారని తెలుస్తుంది.ఈ పార్టీ కోసం రాజమౌళి బృందం ఈ రోజు ముంబై చేరుకోనుంది తెలుస్తుంది.

రామ్ చరణ్ ప్రెసెంట్ ఆర్సీ 15 సినిమా షూటింగ్ కోసం అమృత్ సర్ వెళ్లగా అక్కడి నుండే ఈయన నేరుగా పార్టీకి హాజరవ్వనున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube