బాలీవుడ్ స్టార్ హీరోలలో అమీర్ ఖాన్( Aamir Khan ) ఒకరు.ఈయన తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి మెప్పించాడు.
తన నటనతో ఆడియెన్స్ ను కట్టిపడేసే సత్తా ఉన్న అమీర్ ఖాన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువుగానే ఉంది.అయితే అమీర్ ఖాన్ ఈ మధ్య కాలంలో బిగ్ హిట్ అందుకున్న సందర్భాలు లేవు.
ఈయన ఎన్నో అంచనాలతో చేసిన లాల్ సింగ్ చడ్డా( Laal Singh Chadda ) కూడా ప్లాప్ అయ్యింది.
ఈ సినిమా కోసం టాలీవుడ్ లో కూడా బాగా ప్రమోషన్స్ చేసాడు.
కానీ ఎక్కడ ఈ సినిమా మెప్పించలేక పోయింది.ఇదిలా ఉండగా అమీర్ ఖాన్ కెరీర్ ఎంత సక్సెస్ ఫుల్ గా కొనసాగించిన పర్సనల్ లైఫ్ లో మాత్రం అంతగా సక్సెస్ కాలేక పోయారు.
ఈయన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.ఈయన ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే రెండు పెళ్లిళ్లు కూడా నిలవలేదు అనే చెప్పాలి.1986లో రీనా దత్తను పెళ్లి చేసుకున్న అమీర్ 2002లో విడాకులు ఇచ్చాడు.ఆ తర్వాత ఈయన కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు.2005లో వీరి వివాహం కాగా 2021లో విడాకులు తీసుకున్నారు.రెండు పెళ్లిళ్లు సక్సెస్ కాలేదు.అయిన ఈయన వెంటనే మరో నటితో డేటింగ్ చేస్తున్నాడు.
అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో ఆయన కుమార్తెగా నటించిన ఫాతిమా సన షేక్ తో ( Fatima Sana Shaikh ) ప్రేమలో ఉన్న విషయం కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన కొన్ని రోజులకే బయట పడింది.ఆమె కారణంగానే ఈయన విడాకులు తీసుకున్నట్టు టాక్ అప్పట్లో వినపడింది.మరి ఈ జంట విడాకులు వచ్చినప్పటి నుండి పబ్లిక్ గానే పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతున్నారు.
ఇక ఈయన ఫాతిమాతో రిలేషన్ లో ఉన్నాడని ఫిక్స్ అయ్యింది.
అయితే త్వరలోనే వీరు పెళ్లి చేసుకో బోతున్నారు అంటూ వార్తలు ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.ఇందులో నిజమెంతో తెలియదు కానీ కూతురు వయసు ఉన్న అమ్మాయితో పెళ్లి చేసుకోవడం ఏంటి అని అమీర్ ఖాన్ పై కొంత మంది ఫైర్ అవుతున్నారు.
చూడాలి వీరు హఠాత్తుగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.