విజయవాడ: ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఎల్లో మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
ఇది చాలా దురదృష్ట కరం, దురదృష్టం, నీచం.ఏబీఎన్, టీవీ5లో నన్ను న్యాయమూర్తి మండలించినట్టు వార్తలు ప్రసారం చేసారు.2:30 నుండి 5 గంటల వరకు వాదనలు వినిపించాను.బయటకు వచ్చేసరికి ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేసింది.
న్యాయమూర్తి నా వాదనలు విన్నారు.బుట్టలో వెయ్యి లేదా బురద జల్లు అనే సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారు.
ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారు.రేపు న్యాయమూర్తిని అడుగుతాను.
కోర్టు నన్ను మందలించి ఉంటే ఈ శిక్ష కైనా సిద్ధం.లేదంటే మీరేం చేస్తారో చెప్పండి.
నాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు.
డిబేట్లలో నీచంగా తిట్టిస్తున్నారు.టీవీ5, ఏబీఎన్ లపై విరుచుకు పడిన పొన్నవోలు.న్యాయమూర్తి నేను చెప్పిన వాదనలను ఓపికగా విన్నారు.
నేను రాష్ట్రం తరపున బాధ్యత నిర్వర్తిస్తున్నారు.అన్నిటికీ సిద్ధపడే వచ్చాను.
నా డ్యూటీ పర్ ఫెక్ట్ గా నిర్వర్తిస్తున్నారు.నన్ను వ్యక్తిగత హననం చేస్తున్నారు.
నేను భయపడి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.ఏబీఎన్, టీవీ5 ప్రసారాలను న్యాయమూర్తి ముందు ఉంచుతాను.
నా వాదనలు ఎల్లో మీడియాకు నచ్చలేదు.రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీజీ సైతం అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించింది.రూ.371కోటి లూటీ చేయబడిందని తెలిపారు.
కానీ ఆ ప్రభుత్వ పెద్దే ఈ కేసులో నిందితుడు.కేసులో చంద్రబాబు పాత్రను కోర్టు దృష్టికి తీసుకెళ్లాను.ఈ విషయం ఎల్లో మీడియా ఓర్చుకోలేకపోయింది.ఆర్థిక నేరగాళ్లను ఎలా చూడాలి.
ప్రజల సొమ్ము లూటీ అయిన విధానాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.సోషియో ఎకనమిక్ అఫెన్స్ అనేది చాలా పెద్ద నేరం.
అవినీతిని ఒక్కసారే రూపుమాపలేం.కానీ ఒక్క అడుగు ముందుకు పడాల్సిన అవసరం ఉంది.
ప్రజల సొమ్మును లూటీ చేసినవారికి శిక్ష పడాలి.ఈ కేసు తీర్పు ద్వారా ప్రపంచానికి ఒక సందేశం అందాలి.







