యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్( Panja Vaisshnav Tej ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదికేశవ’( Aadi Keshava ).ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎందుకంటే ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.దీంతో ఈ బ్యూటీ వల్ల ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి అనే చెప్పాలి.
ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.ఈ ఇంట్రెస్టింగ్ డ్రామా రీసెంట్ గా మాస్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.
వైష్ణవ్ తేజ్, శ్రీలీల( Sreeleela ) జోడీని తెరమీద చూడాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ లభించాయి.
ఫస్ట్ సాంగ్ అయితే ట్రెండింగ్ లో నిలిచింది.

ఈ జంట మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్ కు బాగా నచ్చింది.దీంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకున్నారు.టీజర్ కూడా ఆకట్టుకోగా రిలీజ్ వెనక్కి వెనక్కి పోతుంది.
ఆగస్టు లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా వేశారు.అప్పుడు వాయిదా వేయగా నవంబర్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గరకి రావడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇప్పుడు సెకండ్ సాంగ్ పై లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చారు.
రెండవ సాంగ్ ‘నా బుజ్జి బంగారం’ సాంగ్ అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అయితే తెలిపారు.

మరి ఇది బ్యూటిఫుల్ మెలోడీ అని కన్ఫర్మ్ చేస్తూ అంతే అద్భుతమైన పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ కాబోతుంది.జివి ప్రకాష్ ( GV Prakash )సంగీతం అందిస్తుండగా రెండవ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.







