మీ వెసులుబాటుని బట్టి ఆధార్ కార్డు.. ఎన్ని రకాలు ఆధార కార్డులు ఉన్నాయో మీకు తెలుసా?

నేటి దైనందిత జీవితంలో ప్రతి ప్రభుత్వ పథకానికి ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి అయిపోయింది.అలాగే మనం ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డుగా ఆధార్ ని చూపించాల్సిన పరిస్థితి.

 Aadhaar Card According To Your Convenience Do You Know How Many Types Of Aadhaar-TeluguStop.com

ఈ క్రమంలో దేశంలోని దాదాపు మొత్తం వయోజన జనాభాకు ఆధార్ కార్డు ఉంది.ఆధార్ కార్డు జారీ చేసేందుకు ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసింది.

దాని పేరు UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అన్న విషయం మనందరికీ తెలిసినదే.UIDAI పౌరులు ఆధార్ కార్డును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రూపొందించడానికి అనుమతిస్తుంది.

అయితే ఇక్కడ అనేక రకాల ఆధార్ కార్డులు ఉన్నాయి.ఎన్ని రకాల ఆధార్ కార్డులు ఉన్నాయి.

వాటిని ఎలా పొందాలో ఇపుడు తెలుసుకుందాం…

అందులో మొదటిది PVC ఆధార్ కార్డ్.మీరు మీ ఆధార్ కార్డ్‌ను క్రెడిట్ కార్డ్ లాగా చేయాలనుకుంటే మీరు కేవలం 50 రూపాయలు ఖర్చు చేసి PVC ఆధార్ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు.

ఇందులో, అనేక రకాల భద్రతా వివరాలు నమోదు చేయబడతాయి.ఇందులో మీకు సంబంధించిన పూర్తి వివరాలు QR కోడ్ రూపంలో సురక్షితంగా ఉంచాలి.

అలాగే రెండవది mAadhaar Card.UIDAI ఆధార్ కార్డ్ హోల్డర్‌లకు సహాయం చేయడానికి మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది.

ఈ యాప్ ద్వారా ఆధార్ ఇ-కాపీని మీ మొబైల్‌లో భద్రంగా భద్రపరచుకోవచ్చు.

Telugu Aadhar, Types, Uidai, Latest-Latest News - Telugu

ఇక ఇందులో మూడవది ఆధార్ లెటర్.అవును… మీ ఆధార్ కార్డ్ ఒకవేళ పోయినట్లైతే.మీరు అత్యవసర పరిస్థితుల్లో దాన్ని డౌన్‌లోడ్ చేయాల్సి వస్తే మీరు ఆధార్ లేఖను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

OTP ద్వారా మాత్రమే ఆధార్ లేఖను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఇక ఇందులో నాల్గవది అంటే ఆఖరిది E-Aadhaar Card.

మీరు మొబైల్‌లో E-Aadhaar కార్డ్‌ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

ఎలాంటి మోసాన్ని నివారించడానికి UIDAI మాస్క్డ్ E-ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తుంది.ఇందులో చివరి నాలుగు నంబర్లు మాత్రమే పేర్కొనబడ్డాయి.

దీంతో మీ ఆధార్ డేటా దొంగిలించబడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube