తండ్రి హెడ్ కానిస్టేబుల్.. కొడుకు సివిల్స్ ర్యాంకర్.. ఇతని సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

తొలి ప్రయత్నంలో సివిల్స్ లో ర్యాంక్ సాధించడం సులువైన విషయం కాకపోయినా అదిలాబాద్ జిల్లాకు( Adilabad ) చెందిన ఆదా సందీప్ ( aada Sandeep )తన కష్టంతో సులువుగానే లక్ష్యాన్ని సాధించారు.గమ్యం చేరే వరకు లక్ష్య సాధన కోసం ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు.

 Aada Sandeep Inspirational Success Story Details Here Goes Viral In Social Media-TeluguStop.com

సివిల్స్ ఫలితాలలో 830వ ర్యాంక్ సాధించిన ఆదా సందీప్ స్వస్థలం అంకోలి గ్రామం కాగా ప్రస్తుతం సందీప్ కుటుంబం అదిలాబాద్ జిల్లాలోని రవీంద్ర నగర్ లో స్థిరపడింది.

బాల్యం నుంచి ఆదా సందీప్ చదువులో చురుకుగా ఉండేవారు.

ధన్ బాద్ ఐఐటీ కాలేజ్ ( Dhanbad IIT College ) లో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో సంవత్సరం పాటు పని చేశారు.గతేడాది జాబ్ కు గుడ్ బై చెప్పిన ఆదా సందీప్ సివిల్స్ కోసం ఆన్ లైన్ లో శిక్షణ తీసుకుని తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ ను సాధించడం గమనార్హం.

ఐఏఎస్ తన లక్ష్యమని చెబుతున్న సందీప్ ఆ లక్ష్యాన్ని కూడా సాధిస్తారేమో చూడాలి.

తాను కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంలో కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎంతో ఉందని ఆదా సందీప్ వెల్లడించారు.ఆదా సందీప్ తండ్రి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.సందీప్ తండ్రి ఇంటెలిజిన్స్ విభాగంలో పని చేస్తుండటం గమనార్హం.

సందీప్ మంచి ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సమాచారం అందుతోంది.

సందీప్ సోదరుడు రంజిత్ కుమార్( Ranjith Kumar ) ప్రస్తుతం అమెరికాలో జాబ్ చేస్తున్నారు.అకుంఠిత దీక్షతో విజయతీరాలకు చేరిన ఆదా సందీప్ తన సక్సెస్ స్టోరీతో ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.ఆదా సందీప్ కు వచ్చిన ర్యాంక్ కు ఐఏఎస్ రావడం సులువు కాదని తెలుస్తోంది.

ఆదా సందీప్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube