నాలుకతోనే బట్టలు అల్లేస్తున్న యువతి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు...

ఈ ప్రపంచంలో అద్భుతమైన ప్రతిభలు కలిగిన మనుషులు ఎందరో ఉన్నారు.ఒక్కోసారి వారి ప్రతిభలను చూస్తే మనం నోరెళ్ల బెట్టక తప్పదు.

 A Young Girl Knitting Clothes With Her Tongue.. You Will Be Surprised To See The-TeluguStop.com

వాటిని చూసి ఔరా అనకుండా ఉండలేము.ఆడవారు కూడా అమోఘమైన టాలెంట్స్ ప్రదర్శిస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు.

సోషల్ మీడియా( Social media ) పుణ్యమా అని వారి ప్రతిభను మనం చూడగలుగుతున్నాం.తాజాగా సోషల్ మీడియాలో ఒక హ్యూమన్ సెయింగ్ మెషిన్‌కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఆమె తన నాలుకతోనే బట్టలను శరవేగంగా అల్లేస్తోంది.

@Figen_ ట్విట్టర్ పేజీ ఈ వీడియోని షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి ఇప్పటివరకు దీనికి 41 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.“ఆమె కుట్టు మెషిన్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది.” అని ఈ వీడియోకి ఒక క్యాప్షన్ జోడించారు.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే, ఒక యువతి ఒక గుడ్డ పేలికను నోట్లో పెట్టుకుని నాలుక ఆడిస్తూ దానిని ఒక డిజైన్( Design ) లాగా మార్చడం చూడవచ్చు.ఆ దృశ్యాలు చూస్తుంటే ఒక కుట్టు మెషిన్ ఆడిస్తూ మామూలు క్లాత్ ను డిజైన్ క్లాత్ గా మార్చినట్లు అనిపించింది.ఆమె నాలుకతో అలా ఎలా చేస్తుందో అసలు అర్థం కాలేదు.నిజంగా ఇది ఒక అరుదైన టాలెంట్ అని చెప్పుకోవచ్చు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెకు అదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారు.ఇది బ్రిలియంట్ వర్క్ అని యువతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.నాలుకను ఇలాంటి పనులకు కూడా వాడేస్తారా అని మరికొందరు సరదాగా వ్యాఖ్యానించారు.రెండు నిమిషాల్లో న్యూడిల్స్ లాగా గుడ్డను ఆమె మార్చేసిందని, ఆమె నాలుక చాలా వింతగా ఉందని మరికొందరు ఉన్నారు.

ఈ వైరల్ వీడియోను( Viral video ) మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube