విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఘటన చోటుచేసుకోవడానికి ఉప్పు చేప కారణమని తేలిందని తెలుస్తోంది.
మందులో మంచింగ్ కోసం తెచ్చుకున్న ఉప్పుచేప వేపుతుండగా మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు.వలపై నిప్పు రవ్వలు పడటంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
బోట్లన్నీ పక్కపక్కనే ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని తెలిపారు.ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులున్న సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు బయటపెట్టారు.
వారిలో ఒకరిని సత్యంగా గుర్తించిన పోలీసులు మరొక వ్యక్తి వాసుపల్లి నానిగా అనుమానిస్తున్నారు.ఇద్దరు మద్యం మత్తులో ఉండటంతో మంటలను గుర్తించలేదని తెలుస్తోంది.
కాగా ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.







