విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక ఓ విషాద సంఘటన.. అదేమిటంటే..?

భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఏ ఫార్మాట్లో నైనా 18 వ నెంబర్ జెర్సీ తోనే కనిపిస్తాడు.ఎప్పుడూ కూడా నెంబర్ మార్చలేదు.ఎందుకంటే ఆ జెర్సీ నెంబర్ 18వ ఓ విషాద సంఘటన దాగి ఉంది.2006 డిసెంబర్ 18న ఢిల్లీ తరఫున కర్ణాటకతో రంజీ మ్యాచ్ ( Ranji match )ఆడుతున్న సందర్భంలో తన తండ్రి ప్రేమ్ కోహ్లీ( Prem Kohli ) గుండెపోటుతో మరణించాడు.ఈ వార్త విన్న కోహ్లీ బాధను దిగమింగుకొని 90 పరుగులు చేసి ఢిల్లీని ఫాలోఆన్ గండం నుండి గట్టెక్కించాడు.మ్యాచ్ ముగిసిన తర్వాత తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

 A Tragic Incident Behind Virat Kohlis Jersey Number 18 What Is That ,virat Kohli-TeluguStop.com

2006 డిసెంబర్ 18 తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు అని, ఆరోజు ఎప్పటికీ తనకు గుర్తు ఉంటుందని, అదొక చీకటి రోజుగా ఎనలేని బాధను మిగిలించిందని ఓ సందర్భంలో కోహ్లీనే స్వయంగా తెలిపాడు.తన తండ్రి చనిపోయిన తర్వాత తనకు ఫోన్ వచ్చిందని, ఆట కొనసాగించాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఢిల్లీ కోచ్ కు ఫోన్ చేసి, తనకు ఆట మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం ఇష్టం లేదని, కచ్చితంగా ఈ మ్యాచ్ ఆడాలి అనుకుంటున్నట్లు తెలిపాడు.

ఆరోజు మాట్లాడిన మాటలు ఎన్నటికీ మరవలేనని, ప్రాణం ఉన్నంతవరకు క్రికెట్ కు చాలా ప్రాముఖ్యత ఇస్తానని తెలిపాడు.తనకు తన తండ్రి పై ఉండే ప్రేమకు గుర్తుగా, తన తండ్రి మరణించిన 18వ తేదీను తన జెర్సీ నెంబర్ గా సెలెక్ట్ చేసుకున్నానని తెలిపాడు.అదే తన తండ్రి పై తనకు ఉన్న ప్రేమ, తన తండ్రికి ఇచ్చే గౌరవం అని చెప్తూ అదృష్టవశాత్తు భారత జట్టులో తాను అడుగుపెట్టే సమయంలో జెర్సీ నెంబర్ 18 ఖాళీగా ఉండడం చాలా ఆనందం కలిగించిందని తెలిపాడు.అప్పటినుండి జెర్సీ నెంబర్ 18 ను కొనసాగిస్తున్నానని సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నాడు.

ఇక ఐపీఎల్ కోసం చిన్న స్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube