భోపాల్ MANIT యూనివర్సిటీ ప్రాంగణంలో పులి సంచారం

భోపాల్ MANIT యూనివర్సిటీ ప్రాంగణంలో పులి కలకలం రేపింది.వర్సిటీ స్పోర్ట్స్ గ్రౌండ్ వెనుక ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది.

 A Tiger Roams The Premises Of Bhopal Manit University-TeluguStop.com

దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు యూనివర్సిటీకి చేరుకున్నారు.

అనంతరం స్పోర్ట్స్ గ్రౌండ్ పరిసరాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు.ఈ నేపథ్యంలో ప్రొఫెసర్లు, విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ యూనివర్సిటీ సర్క్యులర్ జారీ చేశారు.

క్యాంపస్ లో ఉన్న ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.విద్యార్థులు ఎవరూ హాస్టల్ విడిచి బయటకు రావద్దంటూ హెచ్చరించారు.

తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని తరగతుల్లో విద్యా బోధన నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.మరోవైపు పులి కోసం బోఫాల్ అటవీ శాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube