ప్రపంచం టెక్నాలజీలో అభివృద్ధి చెందుతూ కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి.ప్రజలకు సౌకర్యాల కోసం, ప్రజల సేఫ్టీ కోసం టెక్నాలజీ కొత్త రూపురేఖలను సంతరించుకుంటూనే ఉంది.
తాజాగా ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) సోషల్ మీడియాలో ఓ సరికొత్త ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.ఈ ఆవిష్కరణతో నీటి ప్రమాదాల నుండి పిల్లలకు రక్షణ లభించనుంది.
ఈ ఆవిష్కరణకు సంబంధించిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో చిన్నారులు తరచూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషయం అందరికీ తెలిసిందే.ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నపిల్లలు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయే వార్తలను కూడా అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం.ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు తాజాగా ఓ ఆవిష్కరణ జరిగింది.
దీంతో చిన్నపిల్లలను నీటి ప్రమాదాల నుండి కాపాడవచ్చు.
ఓ యువ శాస్త్రవేత్త( young scientist ) నీటి ద్వారా కలిగే ప్రమాదాలకు గురై చిన్నపిల్లలు మృత్యువాత చెందడం చూసి, ఓ సరికొత్త ఆకర్షణను రూపొందించాడు.రెండు నుండి ఆరు సంవత్సరాల వయసు ఉండే చిన్నపిల్లలను నీటి ప్రమాదాల నుండి కాపాడే ఓ టీ షర్ట్ ( T shirt )డిజైన్ చేశాడు.చిన్నపిల్లలు ఈ టీ షర్ట్ ధరించి నీటిలో పడితే వెంటనే టీ షర్ట్ లో ఉండే బెలూన్ ఆటోమేటిగ్ గా తెరుచుకుంటుంది.
అప్పుడు పిల్లలు నీటిలో మునిగిపోకుండా నీటిపై తేలియాడతారు.కాబట్టి ఈ టీ షర్ట్ ధరిస్తే నీటి ప్రమాదాల నుండి రక్షణ లభించడమే కాకుండా ప్రమాదంలో ఉండే వారిని కూడా రక్షించేందుకు అవకాశం ఉంటుంది.
ఇక వరదల సమయంలో ఈ బెలూన్ టీ షర్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యువ శాస్త్రవేత్త తెలిపారు.ఇది నోబెల్ ప్రైజ్ గెలుచుకునే ఆవిష్కరణల కంటే గొప్పదని ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ ఇచ్చారు.