ప్రమాదాల నుండి పిల్లల్ని కాపాడే టీ- షర్ట్.. అది ఎలా అంటే..?

ప్రపంచం టెక్నాలజీలో అభివృద్ధి చెందుతూ కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి.ప్రజలకు సౌకర్యాల కోసం, ప్రజల సేఫ్టీ కోసం టెక్నాలజీ కొత్త రూపురేఖలను సంతరించుకుంటూనే ఉంది.

తాజాగా ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) సోషల్ మీడియాలో ఓ సరికొత్త ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

ఈ ఆవిష్కరణతో నీటి ప్రమాదాల నుండి పిల్లలకు రక్షణ లభించనుంది.ఈ ఆవిష్కరణకు సంబంధించిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

"""/" / ఇటీవల కాలంలో చిన్నారులు తరచూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషయం అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నపిల్లలు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయే వార్తలను కూడా అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం.

ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు తాజాగా ఓ ఆవిష్కరణ జరిగింది.దీంతో చిన్నపిల్లలను నీటి ప్రమాదాల నుండి కాపాడవచ్చు.

"""/" / ఓ యువ శాస్త్రవేత్త( Young Scientist ) నీటి ద్వారా కలిగే ప్రమాదాలకు గురై చిన్నపిల్లలు మృత్యువాత చెందడం చూసి, ఓ సరికొత్త ఆకర్షణను రూపొందించాడు.

రెండు నుండి ఆరు సంవత్సరాల వయసు ఉండే చిన్నపిల్లలను నీటి ప్రమాదాల నుండి కాపాడే ఓ టీ షర్ట్ ( T Shirt )డిజైన్ చేశాడు.

చిన్నపిల్లలు ఈ టీ షర్ట్ ధరించి నీటిలో పడితే వెంటనే టీ షర్ట్ లో ఉండే బెలూన్ ఆటోమేటిగ్ గా తెరుచుకుంటుంది.

అప్పుడు పిల్లలు నీటిలో మునిగిపోకుండా నీటిపై తేలియాడతారు.కాబట్టి ఈ టీ షర్ట్ ధరిస్తే నీటి ప్రమాదాల నుండి రక్షణ లభించడమే కాకుండా ప్రమాదంలో ఉండే వారిని కూడా రక్షించేందుకు అవకాశం ఉంటుంది.

ఇక వరదల సమయంలో ఈ బెలూన్ టీ షర్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యువ శాస్త్రవేత్త తెలిపారు.

ఇది నోబెల్ ప్రైజ్ గెలుచుకునే ఆవిష్కరణల కంటే గొప్పదని ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ ఇచ్చారు.

పెళ్లి చేసుకోబోతున్న ఒలింపిక్ పతక విజేత