Remedies For Skin Tan : టాన్ ను తొలగించి కేవలం 20 నిమిషాల్లో ముఖాన్ని తెల్లగా మార్చే సూపర్ రెమెడీ మీకోసం!

సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది.ఎండలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి.

ఈ ఎండల్లో బయట తిరిగారంటే చర్మం చాలా త్వరగా టాన్( Tan ) అయిపోతుంది.

ఇటువంటి చర్మం అసహ్యంగా, అందవిహీనంగా కనిపిస్తుంది.

అందుకే టాన్ అయిన చర్మాన్ని రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ రెమెడీ( Super Remedy ) మీకు అద్భుతంగా హెల్ప్ అవుతుంది.ఈ రెమెడీ టాన్ ను తొలగించి కేవలం ఇర‌వై నిమిషాల్లోనే ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్‌ తీసుకుని అందులో కొన్ని పైనాపిల్ ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

A Super Remedy To Remove Tan And Whiten Your Face In Just 20 Minutes
Advertisement
A Super Remedy To Remove Tan And Whiten Your Face In Just 20 Minutes-Remedies F

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకావాలి.అలాగే వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, సరిపడా పైనాపిల్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.పైనాపిల్( Pineapple ) లో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయి.ఇవి మీ చర్మాన్ని కాంతివంతం చేయడానికి తోడ్ప‌తాయి.

టాన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా తొల‌గిస్తాయి.మ‌రియు పైనాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

A Super Remedy To Remove Tan And Whiten Your Face In Just 20 Minutes

అలాగే విట‌మిన్ ఈ ఆయిల్ ఆరోగ్య‌మైన మెరిసే చ‌ర్మాన్ని అందిస్తుంది.స్కిన్ ను తేమ‌గా ఉంచుతుంది.క‌ల‌బంద‌లో ఉండే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని చల్లబరుస్తాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

టాన్ తొలగించడంలో సహాయపడ‌తాయి.బియ్యం పిండి( Rice Flour ), షుగర్ పౌడర్ కూడా టాన్ ను నివారిస్తాయి.

Advertisement

చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తాయి.

తాజా వార్తలు