రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో కొలువుదీరిన రాజన్న సన్నిధిలో వింత ఆచారం ఆనవాయితీగా వస్తోంది.శ్రీరామనవమి రోజున శివపార్వతుల కల్యాణాన్ని నిర్వహిస్తుంటారు.
పరమశివుడితో శివపార్వతులు, జోగినిల వివాహలు జరుగుతుంటాయి.ఓ వైపు దేవతామూర్తుల కల్యాణ మహోత్సవం జరుగుతుండగా మరోవైపు జోగినీలు వివాహాలు చేసుకుంటారు.
వివిధ ప్రాంతాల నుంచి జోగినీలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.ఈ క్రమంలోనే సీతారాముల తలంబ్రాలు సమయంలో జోగినీలు కూడా ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుడే తమ నాథుడని భావిస్తారు.
ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు.