నూనె గింజల పంటలలో మూడవ ప్రధాన పంటగా ఆవాల పంట( Mustard crop ) ను చెప్పుకోవచ్చు.ఆవాలలో గోధుమ రంగు ఆవాలు, పసుపు ఆవాలు, ఇండియన్ ఆవాలు అనే రకాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇండియన్ ఆవాలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నాయి.ఆవాలను, ఆవనూనెను( Mustard oil ) ఊరగాయలలో, వివిధ రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు.
తోలు కర్మాగారాలలో ఆవనూనె వినియోగిస్తారు.ఎటువంటి నేలలలోనైనా ఆవాల సాగు చేయవచ్చు.
కానీ గరప, ఇసుక ప్రాంతాలు అధిక దిగుబడి సాధించడానికి అనుకూలంగా ఉంటాయి.ఇక నేలలో పంట పక్వానికి వచ్చేంతవరకు తేమ అవసరం.
పంట పక్వానికి వచ్చాక పొడి వాతావరణం అవసరం.

పంట వేయడానికి రెండు వారాల ముందు 0.45 మీటర్ల మందం ఉండే పాలిథిన్ పట్టా( Polythene strap )తో నేలను కప్పాలి.ఇలా చేస్తే మట్టి ద్వారా సోకే తెగుళ్లను చాలావరకు అరికట్టవచ్చు.
నేలను దున్నిన తర్వాత చదును చేసి సమానమైన మడులను ఏర్పాటు చేయడం వల్ల మొలకలు సమానంగా మొలకెత్తుతాయి.తర్వాత భూమిలో ఫిప్రొనిల్ 0.3% GR నాలుగు కేజీలు ఎకరా పొలంలో చల్లాలి.ఇలా చేస్తే వేళ్లకు సోకే పురుగులను, పెంకు పురుగులను, తొలిచే పురుగులను అరికట్టవచ్చు.

ఇక ఒక ఎకరానికి ఐదు టన్నుల పశువుల ఎరువులు, 200 కేజీల వేప పిండి, రెండు కిలోల అజో స్పైరిల్లమ్, రెండు కిలోల పాస్పో బ్యాక్టీరియా ఎరువులు వేయాలి.ఇంకా యూరియా 50 కేజీలు, 100 కేజీల అమోనియం సల్ఫేట్, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 25 కిలోల MOP, 25 కిలోల మెగ్నీషియం సల్ఫేట్, బోరాన్ 20% రెండు కిలోలు, కాపర్ సల్ఫేట్ ఐదు కిలోలు భూమిలో వేసుకోవాలి.ఎకరాకు రెండు కిలోల ఆరోగ్యమైన విత్తనాలు తీసుకుని విత్తన శుద్ధి చేసుకోవాలి.విత్తనాలు వేసే ముందే పొలానికి నీరు అందించాలి.విత్తనాలను నాలుగైదు సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి.విత్తిన 15 రోజులలోపు నీటి తడి అందించాలి.







