ఆకాశం పైనుంచి మహిళా రైతుపై పడ్డ పాము.. తర్వాత ఏం జరిగిందంటే..

పొలంలో పనిచేస్తున్న ఒక మహిళకు ఊహించని ఒక శాకంగా అనుభవం ఎదురయ్యింది.ఆకాశం పైనుంచి ఓ పాము వచ్చి ఆమెపై పడింది.

 A Snake Fell From The Sky On A Woman Farmer What Happened Next , America, Texas,-TeluguStop.com

ఆ పాముని ఒక పెద్ద డేగ తన కాళ్లతో పట్టుకొని వెళ్తోంది.అయితే దాని కాళ్ళ నుంచి పాము జారిపోయి నేరుగా వచ్చి ఆ మహిళ పైన పడింది.

అయితే అప్పటికే డేగ దాడిలో బాగా గాయపడి ప్రతిదాడికి ప్రయత్నిస్తున్న పాము మహిళ కూడా ఏమైనా హాని తలపెడుతుందో అని పలుమార్లు కాటు వేసింది.ఈ పామే కాకుండా ఆకాశంలో విహరిస్తున్న డేగ కూడా సదరు మహిళపై దాడి చేయడం మొదలెట్టింది.

ఇలాంటి దారుణమైన పరిస్థితి అమెరికా దేశం, టెక్సాస్ రాష్ట్రం, సిల్స్బీ ( Silsbee ) నగరంలోని 65 ఏళ్ల పెగ్గీ జోన్స్ అనే రైతుకు ఎదురయ్యింది.

Telugu America, Attack, Hawk, Latest, Peggy, Snake, Texas-Latest News - Telugu

రెండేళ్ల క్రితం జరిగిన ఈ షాకింగ్ ఘటన గురించి బాధితురాలు ఓ తాజా ఇంటర్వ్యూలో చెబుతూ అందరినీ విస్మయానికి గురి చేసింది.ఈ మహిళా రైతుకు( woman farmer ) ఇంటి పక్కనే ఆరు ఎకరాల పొలం ఉంది.ఆమె తన భర్తతో కలిసి వ్యవసాయం చేస్తుంటుంది.

అయితే ఒక రోజు వ్యవసాయ పనులు చేస్తుండగా ఆమె పొలంలో ఉన్న ఒక పామును డేగ పట్టుకుంది.ఆపై దానిని తన కాలి గోళ్ల మధ్య ఉంచి ఎత్తుకెళ్లడం ప్రారంభించింది.

ఆ పాము దాని పట్టు నుంచి విడిపించుకోవడానికి గాల్లోనే ట్రై చేసింది.సరిగ్గా పెగ్గీ జోన్స్( Peggy Jones ) వద్దకి రాగానే పాము డేగ కాళ్ళ నుంచి జారీ వచ్చి ఆమె చేతిపై పడింది.

క్షణాల్లోనే అది కాటు కూడా వేసింది.

Telugu America, Attack, Hawk, Latest, Peggy, Snake, Texas-Latest News - Telugu

ఇదంతా గమనించిన సదరు మహిళ ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ భయంతో కేకలు వేయడం ప్రారంభించింది.తన ఆహారాన్ని మహిళ ఎక్కడ తీసేసుకుంటుందోనని డేగ కూడా ఆమె వైపు వచ్చి దాడి చేయడం ప్రారంభించింది.ఒకవైపు డేగ మరొకవైపు పాము ఈ రెండు దాడి చేస్తుంటే ఇక తనకు చావు తప్పదు అని పెగ్గీ జోన్స్ అనుకుంది అయితే ఆమె అరుపులు విన్న భర్త చాలా వేగంగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి పామును, డేగను వెళ్లగొట్టాడు.

అనంతరం ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు మెరుగైన వైద్యం అందించారు.దాంతో ఆమె బతికి బయటపడగలిగింది.కాకపోతే కోల్పోవడానికి చాలానే సమయం పట్టింది.అయితే ఈ సంగతి తెలుసుకున్న చాలా మంది ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube