అటువంటి యాప్స్ గురించి ప్రమోట్ చేయకంటూ నివేతా పేతురాజ్ కు షాక్?

A Shock To Nivetha Pethuraj For Not Promoting Such Apps ,Nivetha Pethuraj Nivetha Pethuraj Promoting Apps,Online Games, Nivetha Pethuraj Photo Shoot,Model Nivetha Pethuraj,Actress Nivetha Pethuraj

ఈమధ్య ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.దీంతో తమకు సంబంధించిన అప్డేట్ లు కాకుండా ఇతర బ్రాండ్లకు చెందిన వాటిని కూడా తమ సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నారు.

 A Shock To Nivetha Pethuraj For Not Promoting Such Apps ,nivetha Pethuraj Niveth-TeluguStop.com

ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు డబ్బుల కోసం వచ్చిన బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు.ఈ మధ్య స్మార్ట్ ఫోన్లో వచ్చే యాప్స్ గురించి కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు.

అయితే ఈ మధ్యకాలంలో కొన్ని యాప్స్ ద్వారా చాలా మోసాలు బయట పడుతున్నాయి.దానివల్ల యూజర్లు మోసపోవటం తప్ప లాభపడింది ఏమీ లేదు.ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్ అంటూ చాలా మోసాలు జరిగాయి.అయితే వీటిని సెలెబ్రెటీలు ప్రమోట్ చేయడంతో ప్రజలు ఫైర్ అవుతున్నారు.

అయితే తాజాగా నివేతా పేతురాజ్ కూడా ఒక యాప్ గురించి ప్రమోట్ చేయడంతో నెటిజన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటి నివేతా పేతురాజ్.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.తన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ.అంతేకాకుండా తన సీరియస్ లుక్కుతో కూడా కుర్రాలని ఫిదా చేసింది.

అతి తక్కువ సమయంలో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించింది నివేతా.

ఇక మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.తొలిసారిగా 2016లో తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత ఏడాది మెంటల్ మదిలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఇక వరుసగా తమిళ, తెలుగు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

చిత్రలహరి, అలా వైకుంఠపురంలో సినిమాలలో మాత్రం సీరియస్ పాత్రలలో బాగా మెప్పించింది.గతంలో విడుదలైన పాగల్ సినిమాతో తన నటనకు మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.

ముఖ్యంగా ఫోటోషూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది.తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను, ఫన్నీ రీల్స్ వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందడానికి బాగా ప్రయత్నిస్తుంది.దీంతో తన ట్రెండీ లుక్ లతో బాగా హడావుడి చేస్తుంది.

ఇక ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.ఇక తన అభిమానులతో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.

వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

అప్పుడప్పుడు తన మూవీ అప్డేట్ లను కూడా పంచుకుంటూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక యాప్ గురించి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రమోట్ చేసింది.ఇక ఆ యాప్ గురించి పూర్తి వివరాలు తెలిపింది.

దీంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్ తనపై ఫైర్ అవుతున్నారు.మోసం చేసే ఇటువంటి యాప్స్ గురించి ప్రమోట్ చేయడం ఆపండి అంటూ ఫైర్ అయ్యారు.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube