కేసీఆర్ కు షాక్..మరో ఎమ్మెల్యే అవుట్..ఏ పార్టీలోకంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగబోతోంది.ఇంకొ కొన్ని నెలల్లో  ఎలక్షన్స్ ఉన్న తరుణంలో అన్ని పార్టీల నాయకులు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకు వెళ్తున్నారు.

  ఈ క్రమంలోనే బిఆర్ఎస్( BRS ) పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించింది.దీంతో టికెట్ కన్ఫామ్ అయిన అభ్యర్థులు  ప్రచారాలలో మునిగిపోయారు.

  టికెట్ రానటువంటి కొంతమంది అభ్యర్థులు కేసీఆర్ పై( KCR ) అలకబూనారు.ఇదే తరుణంలో  అదిలాబాద్ జిల్లాలోని బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే  రాథోడ్ బాపూరావు( RATHOD BAPURAO ) కూడా ఈసారి టికెట్ రాక భంగపడ్డారు.

  బాపూరావు స్థానంలో మరో అభ్యర్థి జాదవ్ అనిల్ కు( Jadav anil )టికెట్ కేటాయించారు కేసీఆర్.దీంతో అసంతృప్తి లోనైనటువంటి బాపూరావు  తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను( KTR ) కలవడానికి అపాయింట్మెంట్ కోరారు.

Advertisement

  కానీ కేటీఆర్ పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు  రాథోడ్ బాపూరావు.

అంతేకాకుండా తన కార్యకర్తలంతా ఏదైనా పార్టీలో చేరాలని ఆయనపై ఒత్తిడి చేస్తున్నారట.  తాజాగా ఆయన కార్యకర్తలు అందరితో రహస్య భేటీలు నిర్వహించి ఏ పార్టీలో చేరాలనే దానిపై క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.ఇదే తరుణంలో కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని, తన కార్యకర్తల కోరిక మేరకు కాంగ్రెస్( Congress )పార్టీలో చేరబోతున్నారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

మరి రాథోడ్ బాపూరావు కాంగ్రెస్ పార్టీలో చేరతారా.? లేదంటే బీఆర్ఎస్ బీఫామ్స్ ఇచ్చేవరకు వెయిట్ చేస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ( Congress party ) కూడా చేరికల విషయంలో చాలా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి చాలామంది అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.అలా దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరు ప్రజల మన్ననలు పొందారు అని సర్వే చేయించి, స్క్రీనింగ్ కమిటీ ఇంకొన్ని రోజుల్లో అభ్యర్థులను ప్రకటించబోతోంది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

మరి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరే వారికి ఎక్కడ టికెట్ ఇస్తారు.చేరిన వారికి ఎలాంటి హామీ ఇస్తారనేది చాలా ఆసక్తికరంగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు