వికారాబాద్ జిల్లాలో సైకో కిల్లర్ ఘాతుకాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.తాండూర్ లో ఉపాధి పేరుతో మహిళలను కిడ్నాప్ చేసి ఓ వ్యక్తి హత్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిందితుడు కిష్టప్పగా గుర్తించిన పోలీసులు సైకో కిల్లర్ ను అదుపులోకి తీసుకున్నారు.గతంలో సైకో కిల్లర్ కిష్టప్ప ఆరు హత్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అయితే రెండు రోజులక్రితం తాండూర్ కు చెందిన ఓ మహిళను కిడ్నాప్ చేసిన కిష్టప్ప ఆమెను హత్య చేశాడు.చంపిన అనంతరం మహిళ మృతదేహాన్ని మూటకట్టి పడేశాడని పోలీసులు వెల్లడించారు.
మహిళ కనిపించడం లేదన్న భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తాండూరు పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.పని ఇప్పిస్తానని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిన కిష్టప్ప ఆమె చీర కొంగుతోనే హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.







