భారతదేశంలో క్రికెట్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంటే ఇండియానే ఫేమస్.
ఇక ఐపిఎల్ వస్తే చాలు అన్ని దేశాలు ఇటువైపు చూస్తుంటాయి.అందుకే క్రికెట్ కు ఇండియాలో అద్భుతమైన క్రేజ్ ఉంది.
ఒకవేళ ఇండియా, పాకిస్థాన్ కు క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది అంటే అదేదో పెద్ద యుద్దమే జరుగుతోంది అన్నట్టుగా అందరూ వెయ్యి కళ్లతో మ్యాచ్ ను చూస్తారు.అలాంటి పాకిస్థాన్ తో తలపడి వరల్డ్ కప్ గెలిచినా కూడా ఆ టీమ్ లోని క్రికెటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది.
టీమిండియా అంటే అందోలో ఎన్నో రకాల టీమ్ లు ఉంటాయి.మామూలు క్రికెట్ టీమ్ తో పాటుగా బ్లైండ్ క్రికెట్ టీమ్ కూడా ఉంది.ఆ టీమ్ కూడా ఎన్నో రికార్డులను నెలకొల్పింది.సాక్షాత్తూ పాకిస్థాన్ టీమ్ తో తలపడి వరల్డ్ కప్ కొట్టింది.
అయినప్పటికీ మన టీమ్ క్రీడాకారుడు ఇప్పుడు కూలీగా పనిచేసుకుంటున్నాడు.గుజరాత్ కు చెందిన నరేష్ తుమ్డా బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుపొందడంతో కీలకపాత్ర పోషించాడు.
అయితే ఇప్పుడు అతను పొట్ట కూటికోసం కూలీగా పనిచేసుకుంటున్నాడు.ప్రస్తుతం తన పరిస్థితి దారుణంగా ఉందని, తన కుటుంబం కోసం కష్టపడుతున్నాని తెలిపాడు.తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని సర్కార్ ను వేడుకున్నాడు.2018వ సంత్సరంలో బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ లో నరేష్ తుమ్డా ఉన్నాడు.షార్జా వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.ఫైనల్ మ్యాచ్ లో ఇండియా జట్టు పాకిస్తాన్ టీమ్ ను ఓడించింది.