సకల దేవతలనే కాదు.ప్రకృతిని సైతం పూజిస్తారు హిందువులు.
మన జీవనానికి సాయం చేసే చెట్టును, పుట్టను, రాయిని కూడా ఆరాధిస్తారు.కొంతమంది కుల దైవం, ఇష్ట దైవం అంటూ రకరకాలు దేవుళ్లు, దేవతలను నిత్యం కొలుచుకుంటారు.
అయితే విచిత్రంగా యముడిని పూజిస్తున్న ఓ వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం.అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం కు చెందిన ఓ వ్యక్తి మాత్రం నరుల ప్రాణాలను తన పాశంతో హరించుకుపోయే యమధర్మరాజు తన ఇష్ట దైవంగా చెబుతున్నాడు.
అంతటితో ఆగలేదు… యముడికి పూజలు చేస్తున్నాడు.ఏకంగా తన చేతిపై పచ్చ బొట్టు పొడిపించుకున్నాడు.
తన వాహనంపై సైతం యమధర్మరాజుకి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లతో స్టికరింగ్ చేయించుకుని తన భక్తి పారవశ్యాన్ని చాటుకున్నాడు.అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని అడిగితే చిరంజీవి నటించిన మంజునాథ సినిమా చూసినప్పటి నుంచి తనకు యమధర్మరాజుపై అభిమానం, భక్తి శ్రద్ధలుపెరిగాయని చెబుుతన్నాడు.
యముడు అందర్నీ సమానంగా చూస్తాడని.తన కర్తవ్యాన్ని ఎప్పడూ తప్పడని చెబుతున్నాడు.
స్థానికులు మాత్రం ఈ వ్యక్తి బండిని, చేతికి వేసుకున్న పచ్చ బొట్టును విచిత్రంగా చూస్తున్నారు.








