జంతువులను ఒక దేశం నుంచి మరో ప్రదేశానికి అక్రమంగా తరలించే ఘటనలు ఎక్కువవుతున్నాయి.తాజాగా ఒక మంగోలియన్ వ్యక్తి తన సంచుల్లో అనేక వన్యప్రాణులను దాచిపెట్టి థాయ్‌లాండ్( Thailand ) నుంచి బయటకు తరలించడానికి ప్రయత్నించాడు.
అతడు బ్యాంకాక్ నుంచి మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్‌కు వెళ్లాలనుకున్నాడు.అయితే విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు శనివారం అతడిని పట్టుకున్నారు.
అతడి బ్యాగులను తనిఖీ చేయగా అందులో ఏకంగా 46 జంతువులు కనిపించాయి.

రెండు కొమోడో డ్రాగన్లను( Komodo dragons ) అతడు అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించాడని అధికారులు తెలిపారు.ప్రపంచంలోనే అతిపెద్ద బల్లులు అయిన ఇవి మూడు మీటర్ల పొడవు, 70 కిలోగ్రాముల వరకు పెరుగుతాయి.ఇవి ఇండోనేషియాలో( Indonesia ) మాత్రమే నివసిస్తాయి, చాలా అరుదుగా కనిపించే ఇవి ప్రస్తుతం అంతరించిపోతున్నాయి.
ఇక అతడి దగ్గర ఆరు భారతీయ నక్షత్ర తాబేళ్లు కూడా ఉన్నాయి.అలానే ఎనిమిది ఇగువానాలు ఉన్నాయి.ఇవి పొడవాటి తోకలు, వెన్నుముకలు ఉన్న పెద్ద ఆకుపచ్చ బల్లులు.మధ్య, దక్షిణ అమెరికాz కరేబియన్‌లోని ( Americaz Caribbean )కొన్ని ద్వీపాలలో ఇవి నివసిస్తున్నాయి.

ఈ స్మగ్లర్ తీసుకెళ్తున్న వాటిలో ఐదు కొండచిలువలు, ఒక బోవా కన్‌స్ట్రిక్టర్ పాములు కూడా ఉన్నాయి.24 బతికి ఉన్న చేపలను కూడా సదరు వ్యక్తి తీసుకు వెళ్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్టు చేసి సంబంధిత కేసుల కింద నేరాలు మోపారు.అతడు రక్షిత జంతువులను అక్రమ రవాణా చేస్తూ చట్టాన్ని ఉల్లంఘించాడు.చాలా మంది వన్యప్రాణుల స్మగ్లర్లు థాయిలాండ్ గుండా వెళుతున్నారని కస్టమ్స్ విభాగం తెలిపింది.ఈ జంతువులను చైనా, వియత్నాం దేశాలకు పంపడానికి ప్రయత్నిస్తారు, అక్కడ కొందరు వాటిని ఆహారం, ఔషధం లేదా అలంకరణ కోసం కొనుగోలు చేస్తారు.