బాంబ్ సైక్లోన్ మంచు తుఫాన్ లో.. ఇద్దరినీ కాపాడే క్రమంలో మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతి..

చాలా రోజుల నుంచి అగ్రరాజ్యమైన అమెరికాను బాంబ్ సైక్లోన్ అనే భారీ మంచు తుఫాన్ అతలాకుతలం చేసింది.

ఈ బాంబ్ సైక్లోన్ వల్ల అమెరికాలో ఇప్పటికే దాదాపు 70 మంది మృతి చెందినట్లు సమాచారం.ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఎంత త్వరగా రక్షణ చర్యలు మొదలుపెట్టిన కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు మాత్రం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి.అమెరికాలో ఈ బాంబ్ సైక్లోన్ మంచు తుఫాను కారణంగా మన రాష్ట్రానికి చెందిన గోకుల్ మృతి చెందారు.

అమెరికాలో జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరినీ కాపాడబోయిన గోకుల్ కూడా మన రాష్ట్రానికి చెందిన ఇద్దరితో పాటు మృతి చెందారు.గుంటూరు జిల్లా పెద్దనందిపాడు కు చెందిన నారాయణ, హరిత దంపతులను కాపాడే క్రమంలో గోకుల్ మరణించడం బాధాకరం.

విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత మేడిశెట్టి శంకర్రావు కుమారుడే గోకుల్.అమెరికాలో మంచి తుఫాన్ దృశ్యాలను నారాయణ ఆయన భార్య ఇద్దరు కలిసి మంచు గడ్డపై దృశ్యాలను చిత్రీకరించే సమయంలో ప్రమాదానికి గురయ్యారు.

మంచు గడ్డపై నిలబడి ఫోటోలు తీసుకునే క్రమంలో వీరిద్దరూ నిలబడి ఉన్న మంచుతో కప్పబడి ఉన్న సరస్సులో చిక్కుకుపోయారు.వీరిని రక్షించడానికి గోకుల్ ఎంతో ప్రయత్నించారు.కానీ నారాయణ హరిత తో పాటు గోకుల్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో గోకుల్ భార్య శ్రీదేవి, కూతురు మహతి కూడా అక్కడే ఉన్నారు.వీరి కళ్ళముందే గోకుల్ మృతి చెందడంతో వారు కన్నీరు మున్నీరు అయ్యారు.నారాయణ, హరిత దంపతుల మృతదేహాలను స్వగ్రామం గుంటూరు జిల్లా పాలపర్రు తీసుకురావాలని ఈ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది అని అమెరికా వార్త పత్రిక సమాచారం.అమెరికాలో మంచి తుఫాన్ వల్ల అక్కడి ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తాజా వార్తలు