ఏపీలో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు కొత్త రూపు రానుంది.ఈ మేరకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షకు మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ హాజరయ్యారు.
ఏడాదిలోగా అన్ని రకాల హాస్టళ్లలో నాడు-నేడు కింద త్వరిత గతిన పనులు చేపట్టాలని తెలిపారు.అదేవిధంగా స్కూళ్ల నిర్వహణ నిధి తరహాలోనే హాస్టళ్ల నిర్వహణకు నిధి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
గురుకులాల్లోని విద్యార్థులకు ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు ఇతర అంశాలపై ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.