ట్విట్టర్( Twitter ) తన బ్లూటిక్ వినియోగదారుల కోసం సరికొత్తగా ఎడిట్ ఫీచ( Edit feature )ర్ ను తీసుకువచ్చింది.అయితే 2022 అక్టోబర్ లోనే ట్విట్టర్ ఎడిట్ ఆప్షన్ ను తీసుకువచ్చింది.
కానీ అప్పుడు వినియోగదారులు కేవలం పోస్ట్ చేసిన 30 నిమిషాలలో మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉండేది.
కొంతమంది వినియోగదారుల డిమాండ్ మేరకు ఈ ఎడిట్ ఫీచర్ ఆప్షన్ టైం ను 30 నిమిషాల నుండి గంట వరకు పొడిగించింది.అంటే ఇకపై పోస్ట్ చేసిన గంటలోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.ఈ ఎడిట్ ఆప్షన్ ఆండ్రాయిడ్, iOS రెండింటిలో ఉపయోగించుకోవచ్చు.
ట్విట్టర్ కేవలం ఈ ఎడిట్ ఆప్షన్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే అందుబాటులోకి తేవడంతో, ట్విట్టర్ వినియోగదారులు చాలామంది బ్లూటిక్ ప్రీమియం సేవను ఎంచుకునే అవకాశం ఉంది.ఈ ఎడిట్ ఆప్షన్ ను ట్విట్టర్ కొత్త సీఈవో గా లిండా యాకారినోను ప్రకటించిన తర్వాత సంస్థ వెల్లడించింది.ఇక ట్విట్టర్ లో బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ కోసం నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.వెబ్ యూజర్లు నెలకు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది.బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్( Blu etick Subscription ) తీసుకున్న వినియోగదారులకు తమ ట్విట్ లను గంటలోపు ఎడిట్ చేసుకునే వీలు పొందడంతో పాటు 1080 పీలో వీడియోలను కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంది.అంతేకాకుండా రిప్లై, మెన్షన్, సెర్చింగ్ లలో బ్లూటిక్ వినియోగదారులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.
అంతేకాదు బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారులు తమ హ్యాండిల్, డిస్ప్లే పేరు, ప్రొఫైల్ పిక్ లను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.ట్విట్టర్ లో ఇన్ని సదుపాయాలు పొందుపరచడం తో బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.