పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ఆది పురుష్( Adipurush ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలో( Tirupathi ) ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా ఈ వేడుక ద్వారా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచిందని చెప్పాలి.
ఇలా ఒకవైపు ఈ సినిమా గురించి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుండగా మరోవైపు నెగెటివిటీని కూడా వైరల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా చూడటానికి దళితులకు అనుమతి లేదు అంటూ సంచలనంగా మారడంతో ఈ వార్తపై స్పందించినటువంటి మేకర్స్ ఇదంతా అవాస్తవమని ఈ సినిమా ఒక వర్గానికి చెందిన వారిది కాదని ఈ సినిమా ప్రతి ఒక్క భారతీయుడు సినిమా అంటూ ఆ వార్తలను ఖండించారు.ఇకపోతే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మనం ఏదైనా ఆలయానికి వెళ్తే చెప్పులను బయట వదిలి ఆలయంలోకి వెళ్లి దేవుడిని పూజిస్తాము అలాంటిది రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా చూడటానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు కూడా ఒక కొత్త రూల్స్ పెట్టినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా చూడటం కోసం థియేటర్లకు వచ్చే వారందరూ కూడా చెప్పులు వేసుకోకుండా థియేటర్లలోకి వెళ్లాలని కండిషన్ పెట్టారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సినిమా చూడటం కోసం ఎవరు చెప్పులు వేసుకోకుండా థియేటర్లకు వెళ్లాలనీ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది.ఇక ఈ సినిమాలో రాముడు పాత్రలో ప్రభాస్ నటించగా సీతమ్మ పాత్రలో కృతి సనన్( Kriti Sanon ) నటించిన సంగతి మనకు తెలిసిందే.







