Brahma Lingeswara Swamy Temple : కార్తీక మాసంలో ఖచ్చితంగా సందర్శించాల్సిన పుణ్య క్షేత్రం...

ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు కార్తీక మాసాన్ని ఎంతో ఘనంగా సంతోషంగా తమ కుటుంబ సభ్యులందరితో కలిసి చేసుకుంటున్నారు.

భక్తులందరూ ఓం నమశివ్వాయ అంటూ జపిస్తూ పూజలు చేస్తున్నారు.

కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలను భక్తులు దర్శించడానికి వెళ్తుంటారు దానివల్ల ఆ మాసంలో దేవాలయాలన్నీ రద్దీగా ఉంటాయి.ఈ కార్తీకమాసంలో కచ్చితంగా దర్శించుకోవాల్సిన శివాలయం విశాఖపట్నం జిల్లాలోని చాలా సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయమైన బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం.

ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏమిటంటే ఆ దేవాలయంలోని శివలింగాన్ని స్వయంగా బ్రహ్మే ప్రతిష్టించాడని అక్కడి ప్రజలు భక్తులు చెబుతూ ఉంటారు.బ్రహ్మలింగేశ్వర దేవాలయం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలో బలిఘట్టంలో ఉంది.

ఈ దేవాలయం చాలా పురాతనమైనది.కృతయుగంలో రాక్షస రాజైన బలిచక్రవర్తి ఎన్నో యజ్ఞలు చేసినట్టు పురాణలలో ఉంది.

Advertisement

ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి పక్కన ఉన్న వరహానది ఉత్తరంగా ప్రవహించడంతో ఈ పుణ్యక్షేత్రాన్ని దక్షిణకాశీ అని భక్తులు పిలుస్తూ ఉంటారు.లోక కళ్యాణం కోసం చేసిన యజ్ఞానికి శివారాధన అయిన తర్వాత బలి చక్రవర్తి బ్రాహ్మణ ప్రార్థించి శివలింగాన్ని భూమి పైకి వచ్చేలా చేస్తాడు.

ఈ కొండపై బలి చక్రవర్తి తన ఇష్టమైన పరమేశ్వరుని ప్రతిష్టించాలని మన సృష్టికి మూలమైన బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు.బలి చక్రవర్తి తపస్సు నచ్చడం వల్ల ఆ బ్రహ్మ దేవుడే స్వయంగా శివలింగ ప్రతిష్ట చేయడానికి వచ్చాడని పూర్వం నుంచి ప్రజలు చెబుతున్నారు.

ఈ దేవాలయంలోని శివలింగాన్ని బ్రహ్మ ప్రతిష్టించడంతో శ్రీ స్వామివారికి బ్రహ్మ లింగేశ్వర స్వామి అనే అప్పటినుంచి భక్తులు పిలుస్తారు.

ఈ శివలింగానికి ప్రతి సోమవారం భక్తులు వచ్చి అభిషేకాలు చేస్తూ ఉంటారు.అలాగే ప్రతీ సంవత్సరం కార్తీమాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమాలు ఘనంగా చేస్తారు.భక్తులకు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల నుంచి 7:30 వరకు దేవాలయం తెరిచి ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024
Advertisement

తాజా వార్తలు